అదాని అక్రమ వ్యాపారాలపై సీబీఐ విచారణ జరపాలి

ABN , First Publish Date - 2023-02-07T00:58:47+05:30 IST

అదాని అక్రమ వ్యాపారంపై సీబీఐ విచారణ జరపాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ డిమాండ్‌ చేశారు.

అదాని అక్రమ వ్యాపారాలపై సీబీఐ విచారణ జరపాలి

రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 6: అదాని అక్రమ వ్యాపారంపై సీబీఐ విచారణ జరపాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ డిమాండ్‌ చేశారు. రాజమహేంద్రవరం మోరంపూడి సెంటర్‌ సమీపంలోని ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ధర్నాలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎనిమిదిన్నరేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిందని మం డిపడ్డారు. ఎల్‌ఐసీ, ఎస్‌బీఐలకు నష్టం చేకూరేలా వాటి ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టిందన్నారు. అదాని సంస్థలపై వచ్చిన ఆర్థిక ఆరోపణలపై విచారణ చేయకుండా వారికే కొమ్ముకాయడం దారుణమన్నారు. పార్టీ నేత రాహుల్‌గాంధీ పెద్దఎత్తున మనీలాండరింగ్‌ జరుగుతోందని, దీని వల్ల దేశానికి తీవ్రమైన ఆర్థిక నష్టం జరుగుతుందని గతంలోనే హెచ్చరించారని గుర్తుచేశారు. ఎల్‌ఐ సీ, ఎస్‌బీఐలలో పేద, మధ్య తరగతి ప్రజలు దాచుకున్న సొమ్మును అక్రమం గా మళ్లించడం చాలా కుటుంబాలకు తీరని నష్టమని అన్నారు. పీసీసీ సభ్యు డు బాలేపల్లి మురళీధర్‌ మాట్లాడుతూ ఎల్‌ఐసీలో రూ.18 వేల కోట్లు, ఎస్‌బీ ఐలో రూ.45 వేల కోట్లు అదాని గ్రూప్‌ వల్ల నష్టం వాటిల్లిందని, ఇదే పరిస్ధితి కొనసాగితే దేశ ఆర్థిక స్థితిగతులు తలక్రిందులవుతాయన్నారు. ధర్నాలో పీసీసీ కార్యదర్శులు ముళ్ళ మాధవ్‌, బెజవాడ రంగారావు, నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు, ఆకుల భాగ్యసూర్యలక్ష్మి, కిశోర్‌కుమార్‌ జైన్‌, చామర్తి లీలావతి, యిజ్జరౌతు విజయలక్ష్మి, కాటం రవి, బత్తిన చంద్రరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:58:48+05:30 IST