గ్యాస్‌ పైప్‌లైన్‌ ఏర్పాటుకు రైతులతో ధర నిర్ధారణపై సమావేశం

ABN , First Publish Date - 2023-01-25T01:09:46+05:30 IST

ఓఎన్జీసీ, గెయిల్‌ ఆధ్వర్యంలో కాకినాడ నుంచి గ్యాస్‌పైపులైన్‌ ఏర్పాటుచేయనున్న దృష్ట్యా మంగళవారం కొత్తపల్లి ఎంపీడీవో కార్యాలయంలో కొమరగిరి, గోర్స గ్రామాల రైతులతో భూముల ధర నిర్దారణపై సమావేశం జరిగింది

గ్యాస్‌ పైప్‌లైన్‌ ఏర్పాటుకు   రైతులతో ధర నిర్ధారణపై సమావేశం

కొత్తపల్లి, జనవరి 24 : ఓఎన్జీసీ, గెయిల్‌ ఆధ్వర్యంలో కాకినాడ నుంచి గ్యాస్‌పైపులైన్‌ ఏర్పాటుచేయనున్న దృష్ట్యా మంగళవారం కొత్తపల్లి ఎంపీడీవో కార్యాలయంలో కొమరగిరి, గోర్స గ్రామాల రైతులతో భూముల ధర నిర్దారణపై సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిఫ్యూటీ కలెక్టర్‌ ఏపీ జీడీసీ కె.సుధారాణి హాజరయ్యారు. గోర్స, కొమరగిరి గ్రామాల మీదుగా ఓన్జీసీ గ్యాస్‌ పైప్‌లైన్‌ ఏర్పాటుకానుందని, ఈ విషయంలో భూముల ధరలపై ఆమె రైతులతో చర్చించారు. రైతులందరూ మౌనం వహించడంతో క్షణాల్లో సమావేశాన్ని ముగించారు. డిప్యూటీ తహశీల్ధార్‌ ముమ్మిడి శ్రీనివాసరావు, ఈవోపీఆర్డీ భాస్కర్‌, విశ్రాంత తహశీల్ధార్‌ ఉదయభాస్కర్‌ పాల్గొన్నారు.

గ్యాస్‌ పైప్‌లైన్‌కు భూములను ఇచ్చే ప్రసక్తే లేదు

తమ భూముల నుంచి ఓన్జీసీ గ్యాస్‌ పైప్‌లైన్‌ ఏర్పాటుచేస్తే తమ భూములు ఎందుకూ పనికిరాకుండా పోతాయని, అందుచేత పైప్‌లైన్‌ ఏర్పాటుకు తమ భూములను ఇచ్చేదిలేదని గోర్స,కొమరగి గ్రామాలకు చెందిన పలువురు రైతులు మంగళవారం కొత్తపల్లి తహశీల్ధార్‌ వద్ద ఆందోళన చేపట్టారు. అంతేకాకుండా గ్యాస్‌ పైప్‌లైన్‌ ఏర్పాటుకోసం రైతులకి ఇచ్చిన నోటీసుల్లో భూములన్నీ నివాసగృహాలకు అతిదగ్గర్లో ఉన్నా యని తెలిపారు. అధికారులు పైప్‌లైన్‌ ఏర్పాటులో పునారాలోచించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్ధార్‌కు వినతి పత్రం సమర్పించారు. రైతులు మద్దా నూకరాజు, పెదిరెడ్ల కాశీ, సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T01:09:48+05:30 IST