‘గుడ్డు’... బ్యాడ్డు!

ABN , First Publish Date - 2023-02-07T01:25:20+05:30 IST

రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న దాణా ధరలు ఒకవైపు, నిలకడలేని గుడ్డు ధరతో మరోవైపు కోళ్ల రైతు కుదేలవుతున్నాడు. ఉత్పత్తి వ్యయం పెరగడంతో పౌలీ్ట్ర నిర్వహణ కత్తిమీద సాములా మారింది. మొన్నటి వరకు రూ.5.50 వరకు పలికిన గుడ్డు ధర ఇప్పుడు 4.20కు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు ట్రేడర్లు, రైతు ల మధ్య సయోధ్య కుదరకపోవడంతో నాలుగు రోజులుగా ప్యా

‘గుడ్డు’... బ్యాడ్డు!

ఆకాశాన్నంటుతున్న దాణా రేట్లు.. పెరగని గుడ్డు ధరలు

రేటు విషయంలో ట్రేడర్లకు, రైతుల మధ్య వివాదం

నాలుగైదు రోజులుగా అమ్మకాలు నిలిపివేసిన రైతులు

ఫారాల వద్ద లక్షలాదిగా పేరుకుపోయిన గుడ్ల నిల్వలు

దేవరపల్లిలో ఆందోళన.. ట్రేడర్లు, రైతుల మధ్య ఒప్పందం?

అనపర్తి, పిబ్రవరి 6 : రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న దాణా ధరలు ఒకవైపు, నిలకడలేని గుడ్డు ధరతో మరోవైపు కోళ్ల రైతు కుదేలవుతున్నాడు. ఉత్పత్తి వ్యయం పెరగడంతో పౌలీ్ట్ర నిర్వహణ కత్తిమీద సాములా మారింది. మొన్నటి వరకు రూ.5.50 వరకు పలికిన గుడ్డు ధర ఇప్పుడు 4.20కు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు ట్రేడర్లు, రైతు ల మధ్య సయోధ్య కుదరకపోవడంతో నాలుగు రోజులుగా ప్యాకింగ్‌లు లేక పౌలీ్ట్రల వద్ద గుడ్లు పేరుకుపోయాయి. ఇటీవలకాలంలో ఇతర రాష్ట్రాల్లో పౌలీ్ట్ర పరిశ్రమ వృద్ధి చెందడంతో భారీగా గుడ్ల ఉత్పత్తి కూడా పెరిగింది. పేపర్‌ రేటు కన్నా సుమారు 0.20 పైసల నుంచి 0.25 పైసల వరకు తగ్గించి ట్రేడ ర్లు గుడ్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే పేపరు ధరకే గుడ్డును కొను గోలు చేయాలంటూ రైతులు చేస్తున్న డిమాండ్‌తో సమస్యలు ఏర్పడ్డాయి. అయితే ప్రస్తుతం కలకత్తాలో పరిస్థితులు ఆశాజనకంగా లేవని ట్రేడర్లు చెబుతుండగా, రైతులు మాత్రం డిమాండ్‌ ఉన్నా ట్రేడర్లు తమకు సరైన ధర ఇవ్వడం లేదని అంటున్నారు. గత నాలుగు రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలోని రైతులు గుడ్లను ప్యాకింగ్‌కు ఇవ్వకుండా భీష్మించారు. అయితే పాత పశ్చిమగోదావరి జిల్లా ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రైతులు గుడ్లను ప్యాకింగ్‌ చేసి లోడులు సిద్ధంచేయడంతో సమస్య ఏర్ప డింది. దీంతో సోమవారం దేవరపల్లి వద్ద లోడు లారీలను రైతులు రైతులు అడ్డుకుని ఆందోళన సాగించారు. గిట్టుబాటు ధర కల్పించాలని, రాష్ట్ర ప్రభు త్వం సబ్సిడీలు ప్రకటించి ఆదుకోవాలని డిమాండు చేశారు.

తాతాల్కిక పరిష్కారం

ట్రేడర్లకు, రైతులకు మధ్య నడుస్తున్న వివాదాలను పరిష్కరించేందుకు వీలుగా దేవరపల్లిలో కొంతమంది నాయకులు కృషి చేశారు. జిల్లావ్యాప్తంగా లక్షలాదిగా గుడ్లు పేరుకుపోతుండడంతో మధ్యేమార్గంగా ఒక పరిష్కారానికి ఇరువర్గాలు అంగీకరించినట్టు సమాచారం. ప్రస్తుతం రైతు మార్కెట్‌ ధర రూ.4.20 ఉంది. కానీ ట్రేడర్లు కమిషన్‌ కింద 20 పైసలు నుంచి 25 పైసల వరకు తగ్గించి రైతులకు చెల్లిస్తున్నారు. దాంతో రైతులకు నాలుగు రూపా యలు మించి దక్కడం లేదు. పేపర్‌ రేటు ప్రకారం చూసినా 4.40 వరకు ఉంది. ఈ నేపథ్యంలో రైతుకు ఎలాంటి తగ్గింపులు లేకుండా గుడ్డు ధర రూ.4.20 చెల్లించేందుకు ఒప్పందం కుదిరినట్టు తెలిసింది. అయితే ఇతర రాష్ట్రాల్లో ఈ ధర లేనందున ట్రేడర్లు ఈ మొత్తం చెల్లించలేమని చేతులెత్తే శారు. దాంతో ట్రేడర్లు రూ.4.20 ధర చెల్లించేలా, అందులో వస్తున్న నష్టంలో పది పైసలు ట్రేడర్లు, మరో పైసలు నెక్‌ సబ్సిడీ రూపంలో చెల్లించేలా అంగీ కారం కుదిరినట్టు తెలుస్తోంది. దీంతో మంగళవారం నుంచి గుడ్డు ఎగుమ తులు ప్రారంభించే అవకాశం ఉందని పౌలీ్ట్ర వర్గాలు చెబుతున్నాయి.

ధర ఇలా ఉంటే పరిశ్రమ మనుగడ కష్టమే

ప్రస్తుతం ఉన్న దాణా ధరలు, విద్యుత్‌ చార్జీలు, లేబర్‌ చార్జీల ప్రకారం ఒక కోడి గుడ్డు ఉత్పత్తి చేసేందుకు సుమారుగా రైతుకు రూ.4.75 పైసల నుంచి రూ.5.00 వరకు ఖర్చవుతుంది. అయితే గుడ్డు ధర ఏడాదిలో రెండు మూడు నెలలు మాత్రం గిట్టుబాటు ధర వచ్చినప్పటికీ మిగిలిన ఎనిమిది, తొమ్మిది నెలలు మాత్రం ధర విపరీతంగా పడిపోవడంతో రైతులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. దీంతో రైతులు ఇప్పటికే కోళ్ల కొత్త బ్యాచ్‌లకు తగ్గిం చుకున్నారు. ఫలితంగా గుడ్ల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గింది. బ్యాచ్‌ లను తగ్గించుకున్నా ఖర్చులు మాత్రం తగ్గకపోవడంతో నిర్వహణ వ్యయా న్ని రైతులు భరించాల్సి వస్తోంది. అలాగే కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కోళ్ల రైతులకు సబ్సిడీలు ఇచ్చి పరిశ్రమకు అండగా నిలుస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కోళ్ల రైతులను ఆదుకునేందుకు ఎటువంటి సబ్సి డీలు ప్రకటించకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోళ్ల పరిశ్రమకు చెందిన నాయకులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డిని కలుసుకుని తమ గోడును వెళ్లబో సుకున్నారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి పౌలీ్ట్ర పరిశ్రమ ఎదుర్కొంటు న్న ఇబ్బందులను తెలుసుకుని నివేదిక ఇవ్వాలని ఒక కమిటీని కూడా అప్ప టి వ్యవసాయశాఖా మంత్రి కన్నబాబుని ఆదేశించారు. కానీ ఇప్పటిదాకా వీరి సమస్యల పరిష్కారంలో మాత్రం ప్రభుత్వం చొరవ చూపలేదు. ఈ నేపథ్యంలో రైతులు ప్రభుత్వ సబ్సిడీల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. కనీసం విద్యుత్‌ చార్జీలపైనా, కోళ్ల మందులపైనా కొన్ని సబ్సిడీలు అందించా లని, సబ్సిడీ ధరకు నూకలు సరఫరా చేయాలని రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. దీనిపై పాలకులు స్పందించకపోవడంతో మ రింత నష్టాల ఊబిలోకి పౌలీ్ట్ర రంగం దిగిపోతోందని, ఇప్పటికైనా ప్రభుత్వా లు స్పందించి ఆదుకునే చర్యలు చేపట్టాలని పౌలీ్ట్ర రైతులు కోరుతున్నారు.

Updated Date - 2023-02-07T01:25:22+05:30 IST