ద్రాక్షారామ భీమేశ్వరుని తెప్పోత్సవం

ABN , First Publish Date - 2023-02-07T00:03:56+05:30 IST

ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారి కల్యాణోత్సవాలలో సోమవారం రాత్రి భీమేశ్వర స్వామివారి తెప్పోత్సవం సప్తగోదావరి నదిలో నయన మనోహరంగా జరిగింది.

ద్రాక్షారామ భీమేశ్వరుని తెప్పోత్సవం

ద్రాక్షారామ, ఫిబ్రవరి 6: ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారి కల్యాణోత్సవాలలో సోమవారం రాత్రి భీమేశ్వర స్వామివారి తెప్పోత్సవం సప్తగోదావరి నదిలో నయన మనోహరంగా జరిగింది. రాత్రి 7.15 కల్యాణమూర్తులు మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వార్లను మంగళ వాయిద్యాల నడుమ సప్తగోదావరిలో విద్యుత్‌ దీపాలంకరణ, పుష్పాలంకృతమైన హంస వాహనం వద్దకు తీసుకుని వచ్చారు. అనంతరం కల్యాణమూర్తులను హంసవాహనంపై కల్యాణ బ్రహ్మలు అధిష్టింపచేశారు. వేదపండితులు బులుసు రామకృష్ణ బృందం ముందుగా స్వామివారికి ఆస్థాన పూజ జరిపారు. అనంతరం కల్యాణ మూర్తులకు నీరాజన మంత్ర పుష్పములు సమర్పిస్తుండగా మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారు సప్తగోదావరి నదిలో జలవిహారం చేశారు. భీమేశ్వరుని జలవిహారం సప్తగోదావరి ఒడ్డుకు చేరుకున్న భక్తులు తన్మయత్వంతో తిలకించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు, సుందరరత్నాకరరావు, ఆలయ ఈవో పి.టి.వి సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:03:58+05:30 IST