చెత్త సంపద కేంద్రాలను అభివృద్ధి చేయాలి: డీపీవో

ABN , First Publish Date - 2023-02-01T23:54:25+05:30 IST

చెత్త నుంచి సంపద తయారుచేసేందుకు నిర్మించిన కేంద్రాలను అభివృద్ధి చేసి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని డీపీవో ఆర్‌. విక్టర్‌ కార్యదర్శులకు ఆదేశించారు. సంపదకేంద్రాలు నిరుపయోగం, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయని ఇటీవలే ఆంధ్రజ్యోతి

చెత్త సంపద కేంద్రాలను అభివృద్ధి చేయాలి: డీపీవో

గండేపల్లి, ఫిబ్రవరి 1: చెత్త నుంచి సంపద తయారుచేసేందుకు నిర్మించిన కేంద్రాలను అభివృద్ధి చేసి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని డీపీవో ఆర్‌. విక్టర్‌ కార్యదర్శులకు ఆదేశించారు. సంపదకేంద్రాలు నిరుపయోగం, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయని ఇటీవలే ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనానికి ఆయన స్పందించి మండలంలోని రామయంపాలెంలో సంపద కేంద్రం వద్ద కార్యదర్శులతో సమావేశం నిరవ్వహించారు. 18 గ్రామ పంచాయతీల పరిధిలో 16 సంపద కేంద్రాలు ఉన్నాయని, ప్రతిచోట ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. కేంద్రా లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారకుండా చూడాలని హెచ్చరించారు. చెత్త సేకరణ వాహనాలు వాడకుండా పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. పెద్దాపురం డీఎల్‌పీవో బాలామణి, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:54:28+05:30 IST