ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటే ఆయుధం

ABN , First Publish Date - 2023-01-26T01:17:42+05:30 IST

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని కొవ్వూరు ఇన్‌చార్జి ఆర్డీవో కె.గీతాంజలి అన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటే ఆయుధం

కొవ్వూరు, జనవరి 25 : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని కొవ్వూరు ఇన్‌చార్జి ఆర్డీవో కె.గీతాంజలి అన్నారు. కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో బుధవారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. సీనియర్‌ ఓటర్లను సత్కరించి, కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులు అందజేశారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. నలుగురు బూత్‌లెవిల్‌ అధికారులకు ఉత్తమ అవార్డులను అందించారు. ఆర్డీవో గీతాంజలి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. ప్రతిపౌరుడు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా మంచి నాయకులను ఎన్నుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో తహశీల్ధార్‌ బి.నాగరాజునాయక్‌, డి.టి. ఎం.కమల్‌సుందర్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ గారపాటి హేమ తదితరులు పాల్గొన్నారు.

నమూనా ఎన్నికల విధానంపై అవగాహన

కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతిశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో మాక్‌ ఎలక్షన్‌ నిర్వహించారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓటరులో చైతన్యం, ఎన్నికల విధానం తెలసుకునే లక్ష్యంతో బీఏ విద్యార్థులు ఈనెల 23వ తేదీ నుంచి నమూనా ఎన్నికల విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రకటన చేయడం, నామినేషన్లు వేయడం, అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు, ప్రజావేదికలో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం, కౌంటింగ్‌, ఫలితాల ప్రకటన వంటి అంశాలను విద్యార్థులు నిర్వహించినట్లు కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్‌ వి.శ్రీనివాసరావు తెలిపారు.

ఓటు హక్కు వజ్రాయుధం

దేవరపల్లి: ఓటుహక్కు వజ్రాయుధం లాంటిదని తాహశీల్దార్‌ ఎం.రామకృష్ణ అన్నారు. దేవరపల్లిలో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా తాహశీల్దార్‌ కార్యాలయం నుంచి బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రాథమిక పాఠశాలలో సీనియర్‌ సిటిజన్‌ ఓటర్లను తాహశీల్దార్‌ రామకృష్ణ సన్మాని ంచారు. కార్యక్రమంలో డిప్యూటీ తాహశీల్దార్‌ ఎం.శ్రీనివాస్‌, ఆర్‌ఐ వెంకటేష్‌, స్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు ఉమాకుమారి, దేవరపల్లి బీహెచ్‌ఎస్‌ఆర్‌ వీఎల్‌ఎం డిగ్రీ కాలేజీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

గోపాలపురం: జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సీనియర్‌ సిటిజన్లను ఘనంగా సత్కరించారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ నుంచి ర్యాలీగా బయల్దేరి చెక్‌పోస్టు సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సంద ర్భంగా తహశీల్దార్‌ వీరేంద్రనాధ్‌ మాట్లాడుతూ ఓటుహక్కు ప్రతిఒక్కరికీ వజ్రాయుధం వంటిదన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, ఉపాధ్యా యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పెరవలి: ఓటు ఎంతో పవిత్రమైనదని దానిని సద్వినియోగించుకోవాలని తహశీల్దార్‌ రాజరాజేశ్వరి పేర్కొన్నారు. ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో భాగం గా పెరవలి హైస్కూలులో ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురు సీనియర్‌ ఓటర్లను శాలువా కప్పి సత్కరించారు. సర్పంచ్‌ గంగోలు సీతమ్మ, వీఆర్‌వో రాజు, అధికారులు పాల్గొన్నారు.

తాళ్లపూడి : 13వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా గ్రామ రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. బల్లిపాడు సర్పంచ్‌ యెల్లిన శివరామకృఫ్ణ ఆధ్వర్యంలో సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్‌ ఓటర్లను సత్కరించారు. తాళ్లపూడి, మలకపల్లి, అన్నదేవరపేటలో వీఆర్వోల ఆధ్వర్యంలో ఓటర్లచే ప్రమాణం చేయి ంచారు. పైడిమెట్టలో సీనియర్‌ ఓటర్లకు వైసీపీ నాయకులు సత్కరించారు.

నల్లజర్ల : జాతీయ ఓటర్ల దినోత్సవం నల్లజర్ల మండలం ఎస్‌ఆర్‌కే కళాశాలలో ఘనంగా నిర్వహించారు. డిప్యూటి తహశీల్దార్‌ వి.కిశోర్‌కుమార్‌ ఆధ్వర్యంలో నల్లజర్ల ఎస్‌ఆర్‌కే కళాశాలలో బుధవారం ఓటరు దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం సినియర్‌ సిటిజెన్‌ మద్దూరి కామేశ్వరా శాస్త్రిని సత్కరించారు. కళాశాల చైర్మన్‌ కంఠమణి నారాయణ ప్రసాద్‌,ప్రిన్సిపాల్‌ కండేపు సుబ్రహ్మణ్యం, కిరణ్‌కుమార్‌, వీఆర్వో లక్ష్మణమూర్తి, యోహన్‌ పాల్గొన్నారు.

ఓటును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రవీణ్‌ ఆదిత్య

రాజానగరం, జనవరి 25: ఓటు హక్కును ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవా లని రాజానగరం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రవీణ్‌ ఆదిత్య పిలుపుని చ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ కేంద్రమైన రాజానగరంలో ఏర్పాటుచేసిన ఓటర్ల అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ఓటు హక్కు పొందిన వారంతా ఓటును సద్వినియోగం చేసుకోవాలని, ప్రధానంగా యువత దీనిపై ప్రజలకు అవగాహన కల్పించే దిశగా కృషి చేయాలన్నారు. దీనిలో భాగంగా తొలుత స్ధానిక తహసీల్దార్‌ కార్యాలయం నుంచి గాంధీబొమ్మ సెంటర్‌ వరకు అవగాహన ర్యాలీ, మానవహారం చేపట్టారు. అనంతరం సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సదస్సులో తహశీల్దార్‌ పవన్‌ కుమార్‌, ఎంపీడీవో బి.రామారావు, డిఫ్యూటీ తహసీల్దార్‌ సునీత, రాజానగరం హైస్కూల్‌ హెచ్‌ఎం జి.కామేశ్వరరావు, విద్యార్ధులు పాల్గొన్నారు.

జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని గైట్‌ ఫార్మసీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈసందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.డి.ధనరాజు మాట్లాడుతూ పటిష్టమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి అందరి భాగస్వామ్యంతో కూడిన ఎన్నికలే కీలకమన్నారు. అనంతరం ఎస్‌.రామ చంద్రన్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ విద్యార్థులచేత ప్రతిజ్ఞ చేయించారు. ఈకార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ పీవో షేక్‌ మీరా, డి.లలిత,విద్యార్ధులు పాల్గొన్నారు.

బిక్కవోలు: మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా బిక్కవోలు పంచాయతీలో ఏఎంసీ చైర్మన్‌ జేవీవీ. సుబ్బారెడ్డి సీనియర్‌ ఓటర్లను సత్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సరెళ్ల సుమలత, ఆర్‌ఎస్‌. పేట మాజీ సర్పంచ్‌ యామన దుర్గాౄరావు, పంచాయితీ కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, వీఆర్‌ఓ అశోక్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే కొమరిపాలెం మెయిన్‌ పాఠశాలలో నిర్వహించిన ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో సర్పంచ్‌ వాసంశెట్టి రవి పాల్గొన్నారు. ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు.

‘ఓటు నమోదు చేసుకోండి’

అనపర్తి: ప్రతిఒక్కరూ ఓటును నమోదు చేసుకోవడమే కాకుండా ఓటుహక్కును వినియోగించుకోవాలని అనపర్తి నియోజకవర్గ ఎలకో్ట్రరల్‌ రిజిస్ట్రేషన్‌ అదికారి, స్పెషల్‌ డిఫ్యూటీ కలెక్టర్‌ ఏబీవీఎస్‌బీ శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం అనపర్తిలోని తేతలి రామిరెడ్డి మంగయ్యమ్మ కళావేదికలో నిర్వహి ంచిన 13వ జాతీయ ఓటర్ల దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిం చారు. ఈ సందర్భంగా సీనియర్‌ సిటిజన్లను సన్మానించారు. అదే విదంగా ఓటర్ల దినోత్సవంపై నిర్వహించిన వ్యాస రచనల పోటీలలోను, రంగవల్లుల పోటీలలోను విజేతలుగా నిలిచిన విద్యార్థినిలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ వారా కుమారి, తహసీల్దార్‌ శశిధర్‌, వీఆర్‌వోలు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T01:17:44+05:30 IST