పప్పుల చీటీ పేరిట ఘరానా మోసం

ABN , First Publish Date - 2023-02-02T00:37:05+05:30 IST

పప్పుల చీటీ పేరుతో ఓ కిరాణా వ్యాపారి ఘరా నా మోసానికి పాల్పడ్డాడు. తక్కువ ధరకే నిత్యావసర సరుకులు అందజేస్తానని నమ్మబలికి ప్రజలనుంచి డబ్బులు కొల్లగొట్టాడు. చివరకు వినియోగదారులకు టోకరా వేసి సరుకులు పంపిణీ చేయకుండా సొమ్ములతో పరారయ్యాడు. ఏలేశ్వరం మండలం సిరిపురం పంచాయతీ పరిధిలోని చిన్నింపే టలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పప్పుల చీటీ పేరిట ఘరానా మోసం

సరుకులు పంపిణీ చేయకుండా కిరాణా వ్యాపారి పరారీ

ఏలేశ్వరం, ఫిబ్రవరి 1: పప్పుల చీటీ పేరుతో ఓ కిరాణా వ్యాపారి ఘరా నా మోసానికి పాల్పడ్డాడు. తక్కువ ధరకే నిత్యావసర సరుకులు అందజేస్తానని నమ్మబలికి ప్రజలనుంచి డబ్బులు కొల్లగొట్టాడు. చివరకు వినియోగదారులకు టోకరా వేసి సరుకులు పంపిణీ చేయకుండా సొమ్ములతో పరారయ్యాడు. ఏలేశ్వరం మండలం సిరిపురం పంచాయతీ పరిధిలోని చిన్నింపే టలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా నివాసం ఉంటున్న వ్యక్తి తాను కిర్లంపూడిలో వ్యాపారం చేస్తున్నానని, నెల కు రూ.300 వంతున ఏడాదికి రూ.3600 చెల్లించాలని, దీనికి అదనంగా మ రో రూ.2వేలు కలపి రూ.5600 విలువైన నిత్యావసర కిరాణా సరుకులు సం క్రాంతికి ఇస్తామని నమ్మించాడు. అతడి మాటలకు ఆశపడి పలువురు ప ప్పుల చీటీలో సభ్యత్వం తీసుకున్నారు. గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసి అధిక మొత్తంలో ప్రజలనుంచి సొమ్ములు వసూలు చేశాడు. ఏలేశ్వరంతో పాటు పరిసర మండలాలకు చెందిన వారు 12నెలలపాటు సొమ్ములు చెల్లించారు. కొందరికి అతడు సక్రమంగా సరుకులు ఇచ్చాడు. పండుగ వచ్చే సరికి మిగిలిన వినియోగదారులు సరుకుల కోసం అతడిపై ఒత్తిడి తెచ్చా రు. సరుకులు లేదా తాము చెల్లించాల్సిన సొమ్ములు తిరిగి ఇచ్చేయాలని పట్టుబట్టడంతో అతడు ముఖం చాటేసి ఇంటినుంచి పరారయ్యాడు. సెల్‌ఫో న్‌ స్విచ్ఛాప్‌ చేయడం, అతడినుంచి సమాధానం లేకపోవడంతో తాము మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు చిన్నింపేటలో అత డి ఇంటివద్దకు వెళ్లి వ్యాపారి తల్లిదండ్రులవద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. వ్యాపారి 400మందిని పప్పుల చీటీ పేరిట మోసం చేసినట్లు సమాచారం. వినియోగదారులనుంచి రూ.25లక్షలకు పైగా సొమ్ములు వసూలు చేసినట్లు తెలుస్తోంది. తాను ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంవల్ల సభ్య త్వం తీసుకున్న వారికి పూర్తిస్థాయిలో సరుకులు ఇవ్వలేకపోయాయని, ఫి బ్రవరి నెలాఖరులోగా తమ సాగు భూమిని విక్రయించి సొమ్ములను తిరిగి ఇచ్చేస్తానని సెల్‌ఫోన్‌ మెసేజ్‌లతోపాటు మధ్యవర్తులు, ఏజెంట్ల ద్వారా వినియోగదారులను ప్రాథేయపడుతున్నట్లు తెలిసింది. దీంతో బాధితులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మిన్నకుండిపోయారు.

Updated Date - 2023-02-02T00:37:07+05:30 IST