సెల్‌ఫోన్లు, బైక్‌ల దొంగ అరెస్టు

ABN , First Publish Date - 2023-02-07T00:09:07+05:30 IST

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు సర్కిల్‌ పరిధిలో సెల్‌ఫోన్‌లు, మోటార్‌బైక్‌లు అపహరిస్తున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి రూ. 13.52 లక్షలు విలువ చేసే 54 సెల్‌ఫోన్‌లు, 9 మోటార్‌బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ప్రత్తిపాడు పోలీ్‌సస్టేషన్‌లో సోమవారం సీఐ కె.కిశోర్‌బాబు ఈ చోరీ సంఘటనపై మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు.

సెల్‌ఫోన్లు, బైక్‌ల దొంగ అరెస్టు

ప్రత్తిపాడు, ఫిబ్రవరి 6: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు సర్కిల్‌ పరిధిలో సెల్‌ఫోన్‌లు, మోటార్‌బైక్‌లు అపహరిస్తున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి రూ. 13.52 లక్షలు విలువ చేసే 54 సెల్‌ఫోన్‌లు, 9 మోటార్‌బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ప్రత్తిపాడు పోలీ్‌సస్టేషన్‌లో సోమవారం సీఐ కె.కిశోర్‌బాబు ఈ చోరీ సంఘటనపై మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు. తుని రూరల్‌ మండలం కొలిమేరు గ్రామానికి చెందిన బొందల అప్పారావు, విజయనగరం మండలం ఎస్‌.కోట కొత్త వలసకు చెందిన బోధల సురే్‌ష తుని, అన్నవరం, సామర్లకోట రైల్వేస్టేషన్లలోను, రైళ్లలోను సెల్‌ఫోన్‌లు చార్జింగ్‌లు పెట్టుకుని ఆదమరిచిన వారి ఫోన్‌లు అపహరిస్తున్నారు. అలాగే నిద్రపోయే ప్రయాణికుల వద్ద నుంచి చోరీకి పాల్పడేవారు. అలాగే ఇళ్ల వద్ద పార్కింగ్‌ ప్రదేశాల్లో మోటార్‌బైక్‌లను అపహరించేవారు. దొంగలించిన సెల్‌ఫోన్‌లను యూట్యూబ్‌లో చూసి వాటి డేటాను తొలగించి దారినిపోయే వారికి తక్కువ రేట్లకు అమ్ముకుని జల్సాలు చేసేవారు. ఇదే క్రమంలో ఆది, సోమవారాల్లో ప్రత్తిపాడు సర్కిల్‌ పరిధిలో సెల్‌ఫోన్‌లు, మోటార్‌ బైక్‌లు అమ్మేందుకు ప్రయత్నిస్తున్న వారిని సర్కిల్‌ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారిలో బొందల అప్పారావు నుంచి ఒక మోటార్‌ సైకిల్‌, 6 సెల్‌ఫోన్‌లు, బోధల సురేష్‌ నుంచి 48 సెల్‌ఫోన్‌లు, 8 మోటార్‌ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌లో వాటి విలువ రూ. 13.52 లక్షలు ఉంటుందని సీఐ కిశోర్‌బాబు తెలిపారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడం, సెల్‌ఫోన్‌, మోటార్‌ సైకిళ్లను చాకచక్యంగా స్వాధీన పరుచుకోవడంలో ప్రత్తిపాడు, ఏలేశ్వరం ఎస్‌ఐ కె.సుధాకర్‌, జి. సతీ్‌షను, పోలీసులు శ్రీనివాస్‌, గోవిందు, కృష్ణ, గోవిందు, సుబ్రహ్మణ్యంను ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - 2023-02-07T00:09:12+05:30 IST