బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

ABN , First Publish Date - 2023-02-07T00:05:37+05:30 IST

ఇంజనీరింగ్‌ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత కాకపోవడాన్ని జీర్ణించుకోలేని ఓ విద్యార్థి జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాకినాడ 3వ డివిజన్‌ గొడారిగుంట శంతనపురి కాలనీకి చెందిన గంగిరి దుర్గారాం గోపాల్‌ (23) తాళ్లరేవు మండలం కోరంగిలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో చదివాడు.

బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

సర్పవరం జంక్షన్‌, ఫిబ్రవరి 6: ఇంజనీరింగ్‌ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత కాకపోవడాన్ని జీర్ణించుకోలేని ఓ విద్యార్థి జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాకినాడ 3వ డివిజన్‌ గొడారిగుంట శంతనపురి కాలనీకి చెందిన గంగిరి దుర్గారాం గోపాల్‌ (23) తాళ్లరేవు మండలం కోరంగిలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో చదివాడు. బీటెక్‌లో పలు సబ్జెక్టులు ఫెయిల్‌ అయ్యాడు. అనంతరం హైదరాబాద్‌ వెళ్లి ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంజనీరింగ్‌ సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు ఇటీవల ఇంటికి వచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం బయటకు వెళ్లి వస్తానని ఇంటి వద్ద తల్లికి చెప్పి బయటకెళ్లిన దుర్గారాం గోపాల్‌ ఇంటికి రాలేదు. వలసపాకలో గల ఓ లాడ్జిలో గది తీసుకుని ఈ దఫా రాసిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తానో లేదోనన్న బెంగతో జీవితంపై విరక్తితో సోమవారం ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లాడ్జిలోనుంచి బయటకు రాకపోవడాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. మృతుని అక్క ఎం.మంజూష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సర్పవరం ఎస్‌హెచ్‌వో ఆకుల మురళీకృష్ణ తెలిపారు.

Updated Date - 2023-02-07T00:05:39+05:30 IST