TTD: టీటీడీ ట్రస్టులకు రూ.60 లక్షల విరాళం

ABN , First Publish Date - 2023-01-12T20:34:28+05:30 IST

తిరుమల శ్రీవారి ట్రస్టులకు గురువారం రూ.60 లక్షలు విరాళంగా అందాయి. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు...

TTD: టీటీడీ ట్రస్టులకు రూ.60 లక్షల విరాళం

తిరుమల: తిరుమల శ్రీవారి ట్రస్టులకు గురువారం రూ.60 లక్షలు విరాళంగా అందాయి. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు, ఆనాథ పిల్లల సంరక్షణ కోసం రూ.10 లక్షలు, బర్డ్‌ ఆస్పత్రి అభివృద్ధికి రూ.10 లక్షలు, హిందూ దేవాలయాల పునరుద్ధరణకు రూ.10 లక్షలు, కాటేజీల నిర్మాణానికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.60 లక్షలను మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ (Suryanarayana) కుమారుడు నితిన్‌సాయి అందజేశారు. విరాళం డీడీలను టీటీడీ (TTD) దాతల విభాగం డిప్యూటీ ఈవో సెల్వంకు దాత నితిన్‌సాయి అందజేశారు.

Updated Date - 2023-01-12T20:34:29+05:30 IST