వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు

ABN , First Publish Date - 2023-01-26T00:01:12+05:30 IST

వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడేవారు ఎవరూ లేరని తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గ పరిశీలకుడు గాజుల ఖాదర్‌బాషా అ న్నారు. కుప్పంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం బూత్‌, క్లస్టర్‌, యూనిట్‌ ఇన్‌చార్జీలతో సమావేశమై లోకేశ్‌ పాద యాత్రకు సంబంధించిన జన సమీకరణ ఏర్పాట్లపై చర్చించారు.

వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు
యూనిట్‌ ఇన్‌ఛార్జీల సమావేశంలో ఖాదర్‌బాషా

కుప్పం, జనవరి 25: వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడేవారు ఎవరూ లేరని తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గ పరిశీలకుడు గాజుల ఖాదర్‌బాషా అ న్నారు. కుప్పంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం బూత్‌, క్లస్టర్‌, యూనిట్‌ ఇన్‌చార్జీలతో సమావేశమై లోకేశ్‌ పాద యాత్రకు సంబంధించిన జన సమీకరణ ఏర్పాట్లపై చర్చించారు. పాదయాత్ర అడ్డు కునేందుకు వైసీపీ ప్రభుత్వం అర్థంలేని ఆంక్షలతో అనుమతులు పోలీసుల ద్వారా పం పిందన్నారు. ఇది జగన్‌ నిరంకుశ పాలనకు నిదర్శమని ధ్వజమెత్తారు. యువగళం పాదయా త్రను విజయవంతం చేయాలనికి యువకులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోనే ఏడువేల మంది యువ సైనికులున్నారని, ఒక్కొక్కరు వందమంది పెట్ట న్నారు. జగన్‌ పాదయాత్రకు చంద్రబాబు నిబంధనలు పెట్టని విషయాన్ని గుర్తు చేస్తూ వైసీపీ ప్రభుత్వ కూసాలు కదులుతాయని భయపడే ఇప్పుడిటువంటి షరతులు విధిం చారని ఎద్దేవా చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టిం చినా పాదయాత్ర విజయవంతమై తీరుతుందని స్పష్టం చేశారు. ఇన్‌చార్జీలందరూ వారివారి బూత్‌స్థాయిలో జన సమీకరణ కోసం పాద యాత్ర గురించి విస్తృత ప్రచారం చేయాలని కోరారు. అనంతరం ఆయన కుప్పం మున్సి పాలిటీ లక్ష్మీపురం సమీపంలో గల మక్కా మసీదులో ముస్లిం మైనారిటీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈనెల 27న పాదయాత్ర ప్రారంభం సందర్బంగా లోకేశ్‌ ఈ మసీదుకు వస్తున్నారని, ముస్లిం సోదరులందరూ ఆయన తో కలసి ప్రార్థనల్లో పాల్గొనాలని కోరారు. త్రిలోక్‌, గోపీనాథ్‌, యూనిట్‌ ఇన్‌చార్జీలు రవి నాగరాజు, వేణు, సురేశ్‌, సతీశ్‌ జాకిర్‌, కన్న స్వామి, గిరి, మహదేవన్‌, సుబ్రమణ్యం, బాల, కుమార్‌, ముఖేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:01:13+05:30 IST