నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం

ABN , First Publish Date - 2023-01-25T00:07:42+05:30 IST

జాతీయ ఓటర్ల దినోత్సవం బుధవారం స్థానిక అంబేడ్కర్‌ భవన్‌లో జరుగుతుందని కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు.

నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 24: జాతీయ ఓటర్ల దినోత్సవం బుధవారం స్థానిక అంబేడ్కర్‌ భవన్‌లో జరుగుతుందని కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9.30 గంటలకు గాంధీ సర్కిల్‌ నుంచి ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్‌ భవన్‌లో జిల్లాస్థాయి కార్యక్రమం జరుగుతుందని వివరించారు. యువ ఓటర్లకు ఎపిక్‌ కార్డుల పంపిణీ, సీనియర్‌ సిటిజన్లకు సన్మాన కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన బీఎల్వోలకు ప్రశంసాపత్రాల పంపిణీ, వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేస్తామని వివరించారు.

Updated Date - 2023-01-25T00:07:42+05:30 IST