రియాద్‌లో టీడీపీ సంబరాలు

ABN , First Publish Date - 2023-03-20T00:17:35+05:30 IST

రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్సీలు గెలుపొందడంతో సౌదీఅరేబియాలోని రియాద్‌లో ఎన్‌ఆర్‌ఐలు సంబరాలు చేసుకొన్నారు.

రియాద్‌లో టీడీపీ సంబరాలు
రియాద్‌లో కేక్‌ కట్‌ చేస్తున్న వడ్లమూడి సారథినాయుడు

చంద్రగిరి, మార్చి 19: రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్సీలు గెలుపొందడంతో సౌదీఅరేబియాలోని రియాద్‌లో ఎన్‌ఆర్‌ఐలు సంబరాలు చేసుకొన్నారు. సౌదీ అరేబియా టీడీపీ సోషల్‌ మీడియా కో-ఆర్డినేటర్‌ వడ్లమూడి సారథినాయుడు ఆధ్వర్యంలో రియాద్‌లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మార్పు మొదలైందన్నారు. వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారన్నారు. వైసీపీ అరాచకాలు, దౌర్జన్యాలను భరించలేకనే పట్టభద్రులు వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పారని తెలిపారు. 2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం తథ్య మన్నారు. ఈ కార్యక్రమంలో దామరకుప్పం రమే్‌షబాబు, కడియాల గౌరయ్య, ముండ్లూరి చలపతిరావు, పోకూరి దేవ, మంగళగిరి సురేష్‌, రాజు, నగరం కుమార్‌, గుణశేఖర్‌, మోహన్‌, కొడవటి ప్రసాద్‌, చక్రపాణి, చంద్రబాబు, హేమాద్రి, కిరణ్‌, ప్రసాద్‌, కృష్ణశ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-20T00:17:35+05:30 IST