ఎన్‌హెచ్‌ పనులు వేగవంతం చేయండి : జేసీ

ABN , First Publish Date - 2023-01-24T23:58:54+05:30 IST

జిల్లాలో కొనసాగుతున్న జాతీయ రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జేసీ ఎస్‌.వెంకటేశ్వర్‌ ఆదేశించారు.

ఎన్‌హెచ్‌ పనులు వేగవంతం చేయండి : జేసీ
సమీక్షిస్తున్న జేసీ వెంకటేశ్వర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 24 : జిల్లాలో కొనసాగుతున్న జాతీయ రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జేసీ ఎస్‌.వెంకటేశ్వర్‌ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన తన ఛాంబర్‌లో జాతీయ రహదారుల శాఖ అధికారులతో సమావేశ మయ్యారు. బెంగళూరు - చెన్నై ఎక్స్‌ప్రెస్‌ హైవే పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. ఎక్కడైనా సమస్యలుంటే సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావా లన్నారు. చిత్తూరు - తచ్చూరు జాతీయ రహదారికి సంబంధించి భూసేకరణ పూర్తి చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో ఎన్‌హెచ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ కార్తీక్‌రెడ్డి, చిత్తూరు ఆర్డీవో రేణుక పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T23:58:54+05:30 IST