27లోపు పీహెచ్ ఒరిజినల్ పత్రాల పరిశీలన
ABN , First Publish Date - 2023-01-25T00:00:13+05:30 IST
2023 ఏప్రిల్లో జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాసే శారీరక వైకల్యం కలిగిన విద్యార్థులు పీహెచ్ ధ్రువీకరణ పత్రాలను డీఈవో కార్యాలయంలో పరిశీలనకు తేవాలని డీఈవో విజయేంద్రరావు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.

చిత్తూరు (సెంట్రల్), జనవరి 24: 2023 ఏప్రిల్లో జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాసే శారీరక వైకల్యం కలిగిన విద్యార్థులు పీహెచ్ ధ్రువీకరణ పత్రాలను డీఈవో కార్యాలయంలో పరిశీలనకు తేవాలని డీఈవో విజయేంద్రరావు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ నెల 27వ తేదీలోపు డీఈవో కార్యాలయంలో ఒరిజినల్ పత్రాలను పరిశీలింపజేయించుకుని తిరిగి వెంట తీసుకెళ్లాలని తెలిపారు.