వాన కష్టం

ABN , First Publish Date - 2023-03-19T00:02:28+05:30 IST

తిరుపతి జిల్లాలోని తూర్పు మండలాల్లో శనివారం కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకూలాయి.

వాన కష్టం
పేటలో తడిచిన వరి ఓదెలను ఆరబెట్టుకుంటున్న రైతు

తూర్పు మండలాల్లో దెబ్బతిన్న పంటలు

విరిగిపడ్డ చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

జిల్లాలోని తూర్పు మండలాల్లో శనివారం కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. శ్రీకాళహస్తి మండలంలోని ఉడమలపాడు, మంగళపురి గ్రామాల్లో మధ్యాహ్నం వడగండ్ల వాన కురిసింది. తొట్టంబేడు మండలంలో ఈదురుగాలులకు నిమ్మచెట్లు విరిగిపడ్డాయి. ఏర్పేడు-వెంకటగిరి రహదారిపై చెట్లు కూలడంతో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. శ్రీకాళహస్తి డివిజన్‌లో పరిధిలోనే విద్యుత్‌ శాఖకు సుమారు రూ.10లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. సూళ్లూరుపేటలో నూర్పిడి చేసిన ధాన్యం రాశులు, మిరప పంట తడిచిపోయింది. కోట మండలంలో కర్బూజా పంటకు నష్టం జరిగింది. నాయుడుపేటలో వరి ఓదెలన్నీ తడిచిముద్దయ్యాయి. పెళ్లకూరు మండలంలోనూ ధాన్యం తడిచిపోయింది.

- తిరుపతి, ఆంధ్రజ్యోతి

Updated Date - 2023-03-19T00:02:28+05:30 IST