రేపటి నుంచి ప్లాస్టిక్‌ ఫ్లెక్సీ నిషేధం

ABN , First Publish Date - 2023-01-25T00:12:36+05:30 IST

ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం నుంచి జిల్లావ్యాప్తంగా ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల నిషేధం అమలు చేయనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్‌ తెలిపారు.

రేపటి నుంచి ప్లాస్టిక్‌ ఫ్లెక్సీ నిషేధం
పోస్టర్లు ఆవిష్కరిస్తున్న డీఆర్వో రాజశేఖర్‌, అధికారులు

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 24 : ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం నుంచి జిల్లావ్యాప్తంగా ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల నిషేధం అమలు చేయనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ మీటింగ్‌ హాలులో అధికారులతో ఆయన సమీక్షించారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకాన్ని కూడా గురువారం నుంచి నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. దీన్ని కఠినంగా అమలు చేయాలన్నారు. కాలుష్య నియంత్రణా మండలి ప్రాంతీయ అధికారి ఎ.నరేంద్రబాబు ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల నిషేధంపై ప్రభుత్వం విధించిన నిబంధనలను వివరించారు. కార్యక్రమంలో కమర్షియల్‌ ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ వై.శ్రీనివాసరావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి జి.చంద్రశేఖర్‌, పంచాయతీరాజ్‌ శాఖ ఏవో ఎన్‌.మనుద్దీన్‌ ఖాన్‌, జిల్లా రవాణా శాఖ ఏవో పి.మురళీధర్‌, చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవర్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:12:36+05:30 IST