పాముకాటుతో వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2023-03-19T01:29:17+05:30 IST

మండలంలోని పనపాకం పంచాయ తీలోని బోడిగుట్ట వారిపల్లెలో పాము కాటుకు గురై ఓ వృద్ధుడు మృతి చెం దాడు.

పాముకాటుతో వృద్ధుడి మృతి
రామ చంద్రయ్య

చంద్రగిరి, మార్చి 18: మండలంలోని పనపాకం పంచాయ తీలోని బోడిగుట్ట వారిపల్లెలో పాము కాటుకు గురై ఓ వృద్ధుడు మృతి చెం దాడు. గ్రామస్తుల కథనం మేరకు.. బోడి గుట్ట వారిపల్లెకు చెందిన రామ చంద్రయ్య(65) తిరుపతి రుయా ఆస్ప త్రిలో పనిచేస్తూ ఇటీవల ఉద్యోగ రమణ పొందాడు. శనివారం సాయంత్రం పశువులకు గడ్డికోసం పొలం లోకి వెళ్లాడు. గడ్డి కోస్తుండగా పాముకాటుకు గురయ్యాడు. గ్రామస్తులు 108లో తిరుపతి రుయా కు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

Updated Date - 2023-03-19T01:29:17+05:30 IST