సమన్వయంతో యువగళాన్ని విజయవంతం చేద్దాం: అమర్‌

ABN , First Publish Date - 2023-01-25T23:57:38+05:30 IST

డీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈనెల 27వతేది కుప్పం నుంచి చేపట్టనున్న యువగళం పాదయాత్రను విజ యవంతం చేయాలని మాజీ మంత్రి అమరనాథ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

సమన్వయంతో యువగళాన్ని విజయవంతం చేద్దాం: అమర్‌
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి అమరనాథరెడ్డి

బైరెడ్డిపల్లె, జనవరి 25: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈనెల 27వతేది కుప్పం నుంచి చేపట్టనున్న యువగళం పాదయాత్రను విజ యవంతం చేయాలని మాజీ మంత్రి అమరనాథ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బైరెడ్డిపల్లె పట్టణంలోని రాయల్‌మహల్‌లో బుధవారం జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడు తూ కుప్పంనుంచి కొనసాగే పాదయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేయా లని కోరారు. అన్నిచోట్లా లోకేశ్‌కు సాదరస్వాగతం పలికి సభలు జయప్రదం చేయడానికి సిద్ధంగా వుండాలని దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం నాయ కులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్ర జలు నిశితంగా గమనిస్తున్నారని ఎన్నో వైఫల్యాలతో అస్తవ్యస్తంగా వున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు కిశోర్‌గౌడు, ప్రధాన కార్యదర్శి సుబ్ర మణ్యంశెట్టి, రామచంద్రనాయుడు, నాగభూషణం, రఘుచంద్రగుప్తా, వెంకటప్పగౌడు, మంజునాథరెడ్డి, మునస్వామిరెడ్డి, గోవిందస్వామి, భువనచంద్రగౌడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T23:57:38+05:30 IST