బ్యాక్‌లాగ్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2023-01-26T02:40:00+05:30 IST

చిత్తూరు జిల్లాలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన నిరుద్యోగ విభిన్న ప్రతిభావంతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు శ్రీనివాస్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

బ్యాక్‌లాగ్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

చిత్తూరు, జనవరి 25: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన నిరుద్యోగ విభిన్న ప్రతిభావంతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు శ్రీనివాస్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వచ్చే నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు విభిన్న ప్రతిభావంతుల కార్యాలయం, అంబేడ్కర్‌ భవన్‌, కలెక్టరేట్‌ ప్రాంగణంలో దరఖాస్తులు అందించాలని పేర్కొన్నారు. దృష్టిలోపం కలిగిన మహిళా దివ్యాంగులకు 4 పోస్టులు కేటాయించామని తెలిపారు. బధిర, మూగ, చెవుడు లోపం కలిగిన అభ్యర్థులకు మూడు పోస్టులు కేటాయించామని పేర్కొన్నారు. శారీరక లోపం కలిగిన దివ్యాంగులకు ఒక్క పోస్టు ఉందని వెల్లడించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఠీఠీఠీ.ఛిజిజ్ట్టీౌౌట.జౌఠి.జీుఽ... వెబ్‌సైట్‌లో ఎస్‌ఆర్‌డీ బ్యాక్‌లాగ్‌ నోటిఫికేషన్‌ ఫర్‌ డిఫరెంట్‌ డిసేబుల్డ్‌ పర్సన్స్‌-2023 దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వివరించారు.

Updated Date - 2023-01-26T02:40:00+05:30 IST