జిల్లాలో 10 రోజులపాటు కేంద్ర బృందం పర్యటన

ABN , First Publish Date - 2023-01-25T00:09:30+05:30 IST

జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు 10 రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నట్లు కేంద్ర బృందం సభ్యులు కుమార్‌సాహో, సత్యపత్ర బెహరాలు వెల్లడించారు.

జిల్లాలో 10 రోజులపాటు కేంద్ర బృందం పర్యటన
లబ్దిదారులతో మాట్లాడుతున్న కేంద్ర బృందం సభ్యులు

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 24: జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు 10 రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నట్లు కేంద్ర బృందం సభ్యులు కుమార్‌సాహో, సత్యపత్ర బెహరాలు వెల్లడించారు. మంగళవారం వారిని జేసీ వెంకటేశ్వర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా చిత్తూరులో ఇండియన్‌ బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండ్‌సిటీ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రాన్ని బృందసభ్యులు సందర్శించారు. అనంతరం పెనుమూరు మండలం కలిగిరి పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. వారివెంట జడ్పీ సీఈవో ప్రభాకర్‌ రెడ్డి, డీఆర్డీఏ పీడీ తులసి, డ్వామా పీడీ గంగాభవాని ఉన్నారు.

Updated Date - 2023-01-25T00:09:30+05:30 IST