కాణిపాకంలో అక్షరాభ్యాసాలు

ABN , First Publish Date - 2023-01-25T00:08:36+05:30 IST

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో గురువారం వసంత పంచమిని పురస్కరించుకుని అక్షరాభ్యాసాలు చేయించ నున్నట్లు చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు తెలిపారు.

 కాణిపాకంలో అక్షరాభ్యాసాలు

ఐరాల(కాణిపాకం), జనవరి 24 : కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో గురువారం వసంత పంచమిని పురస్కరించుకుని అక్షరాభ్యాసాలు చేయించ నున్నట్లు చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు తెలిపారు. ఆస్థాన మండపంలో ఉదయం 7.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పాల్గొనే వారు రూ.200 చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. వసంత పంచమి కావడంతో ఆ రోజున ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.

Updated Date - 2023-01-25T00:09:50+05:30 IST