270 అన్నమయ్య సంకీర్తనలకు బాణీలు

ABN , First Publish Date - 2023-02-07T04:04:09+05:30 IST

శ్రీవారిపై తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన సంకీర్తనల్లో జనబాహుళ్యంలో లేని వాటికి విస్తృత ప్రచారం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

270 అన్నమయ్య సంకీర్తనలకు బాణీలు

త్వరలో వెబ్‌సైట్‌, యూ ట్యూబ్‌లో అప్‌లోడ్‌

తిరుమల, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): శ్రీవారిపై తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన సంకీర్తనల్లో జనబాహుళ్యంలో లేని వాటికి విస్తృత ప్రచారం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు బాణీలు లేని సంకీర్తనలను అర్థ, తాత్పర్యాలతో జనంలోకి తీసుకువెళ్లేందుకు టీటీడీ నడుం బిగించింది. సోమవారం తిరుపతిలో ఈ అంశంపై ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా 270 సంకీర్తనలను స్వరపరిచిన గాయకుల చేత తిరుమల నాదనీరాజనం వేదికపై గానం చేయించేందు కు ఏర్పాట్లు చేస్తామన్నారు. వీటిని టీటీడీ వెబ్‌సైట్‌తో పాటు అన్ని సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. రెండో విడతగా మరో 340 సంకీర్తనలను స్వరపరిచే ఏర్పాట్లు చేశామని తెలిపారు.

Updated Date - 2023-02-07T04:04:09+05:30 IST