‘సర్దుబాటు’తో ప్రాథమిక విద్యకు దెబ్బ: ఆప్తా

ABN , First Publish Date - 2023-01-26T04:27:45+05:30 IST

ఉపాధ్యాయుల పని సర్దుబాటు కారణంగా ప్రాథమిక విద్య దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం(ఆప్తా) ఆందోళన వ్యక్తంచేసింది.

‘సర్దుబాటు’తో ప్రాథమిక విద్యకు దెబ్బ: ఆప్తా

పాధ్యాయుల పని సర్దుబాటు కారణంగా ప్రాథమిక విద్య దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం(ఆప్తా) ఆందోళన వ్యక్తంచేసింది. సర్దుబాటు వల్ల ప్రాథమిక విద్యకు నష్టం లేకుండా చేయాలని కోరుతూ ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏజీఎస్‌ గణపతిరావు, కె.ప్రకాశరావు బుధవారం విద్యాశాఖ మంత్రి, పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌లకు లేఖలు రాశారు. కొన్నిచోట్ల ప్రాథమిక పాఠశాలల్లోని టీచర్లంతా సర్దుబాటులో వేరే పాఠశాలలకు వెళ్లాలని ఆదేశాలు వచ్చాయని, దీంతో ఆ పాఠశాలల్లో బోధన కుంటుపడే ప్రమాదం ఉందన్నారు.

Updated Date - 2023-01-26T04:27:47+05:30 IST