కడప.. పోరుమిళ్లలో సైబర్ మోసం

ABN , First Publish Date - 2023-01-25T19:43:11+05:30 IST

జిల్లాలోని పోరుమిళ్లలో కేటుగాళ్లు సైబర్ మోసానికి పాల్పడ్డారు. వీడియో అప్‌లోడ్ చేస్తే డబ్బులు వస్తాయని ఎర చూపించి దోపిడీకి పాల్పడుతున్నట్లు బాధితులు పేర్కొన్నారు.

కడప.. పోరుమిళ్లలో సైబర్ మోసం

కడప: జిల్లాలోని పోరుమిళ్లలో కేటుగాళ్లు సైబర్ మోసానికి పాల్పడ్డారు. వీడియో అప్‌లోడ్ చేస్తే డబ్బులు వస్తాయని ఎర చూపించి దోపిడీకి పాల్పడుతున్నట్లు బాధితులు పేర్కొన్నారు. వీడియో అప్‌లోడ్ చేసిన మహిళకు రూ.3వేల వరకు ఆ కేటుగాళ్లు పంపినట్లు బాధితురాలు తెలిపింది. అయితే ఈ నేపథ్యంలో ఆ కేటుగాళ్లను నమ్మిన ఆ మహిళ రూ.14.75లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసింది. మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు మహిళ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2023-01-25T19:46:18+05:30 IST