ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి
ABN , First Publish Date - 2023-01-26T00:18:05+05:30 IST
దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని జిల్లా బ్యాంకు ఉద్యోగుల సంఘం సమన్వయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు రుష్యేంద్రబాబు, మున్వర్‌బాషా డిమాండ్ చేశారు.

30, 31న బ్యాంకుల జాతీయ సమ్మె
అనంతపురం క్లాక్‌టవర్, జనవరి 25: దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని జిల్లా బ్యాంకు ఉద్యోగుల సంఘం సమన్వయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు రుష్యేంద్రబాబు, మున్వర్‌బాషా డిమాండ్ చేశారు. ఈనెల 30, 31వతేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించే జాతీయ బ్యాంకు ఉద్యోగుల సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. బుధవారం స్థానిక టవర్ క్లాక్ వద్ద ఉన్న కెనరాబ్యాంకు ఎదుట జిల్లా బ్యాంకు ఉద్యోగులసంఘం సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా రుష్యేంద్రబాబు, మున్వర్‌బాషా మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం, భారత బ్యాంకుల సంఘం నిర్లక్ష్యంతో అటు బ్యాంకులు, ఇటు ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నా రన్నారు. వేతనసవరణ, పెన్షనలో లొసుగులను సవరించాలన్నారు. దేశ వ్యాప్తంగా ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. పారిశ్రామిక వివాదాల చట్టం, ట్రేడ్ యూనియన చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ నాయకులు రఘునాథ్‌రెడ్డి, సంజయ్‌రామ్, మల్లికార్జున, శివారెడ్డి, చంద్రమౌళి, భాస్కర్, బయన్న, శైలజ, రేణుక, భారతి, చరిత, శ్రీకాంత, కుళ్ళాయిస్వామి, శ్రీరాములు, రమణరాజు, క్రాంతికుమార్, పుష్పవాణి, రాధా తదితరులు పాల్గొన్నారు.