ప్రతినిధుల బృందం పర్యటనకు పటిష్ట భద్రత

ABN , First Publish Date - 2023-02-06T23:19:44+05:30 IST

జీ-20 దేశాల ప్రతినిధుల బృందం లేపాక్షి ని సందర్శిస్తున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు అనంతపు రం డీఐజీ రవిప్రకాశ పేర్కొన్నారు.

ప్రతినిధుల బృందం పర్యటనకు పటిష్ట భద్రత

లేపాక్షిని తనిఖీ చేసిన డీఐజీ

అధికారులకు దిశానిర్దేశం

హిందూపురం, ఫిబ్రవరి 6: జీ-20 దేశాల ప్రతినిధుల బృందం లేపాక్షి ని సందర్శిస్తున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు అనంతపు రం డీఐజీ రవిప్రకాశ పేర్కొన్నారు. సోమవారం రాత్రి లేపాక్షి పోలీస్‌ స్టేషనలో ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌, డీఎస్పీలతో ఆయన సమీక్షించారు. ప్రతినిధు ల బృందం కర్ణాటకలోని పావగడ తాలూకా తిరుమణి సమీపంలో సోలార్‌పార్క్‌ సందర్శన నిమిత్తం వెళ్లనున్నారు. బృందం జిల్లాసరిహద్దులో ప్రవేశించినప్పటి నుంచి సరిహద్దు దాటేవరకు భద్రతలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకూడదన్నారు. పర్యటించే రహదారుల్లో అధికారులు, సిబ్బందికి సూ చించిన ప్రాంతాల్లో గట్టి నిఘా ఉంచాలన్నారు. తిరుగు ప్రయాణంలో లేపాక్షిని సందర్శించి ఆలయానికి రానున్నారు. ఈసందర్భంగా ఆలయం చుట్టూ భద్రతా సిబ్బంది పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. సోమవారం రాత్రి నుంచే కొన్ని ప్రాంతాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశించా రు. అవసరమైతే ప్రత్యేక పోలీసు బలగాలను బందోబస్తులోకి దింపాలన్నా రు. లేపాక్షిలో కొత్త వ్యక్తులకు షెల్టర్‌ ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భారీ ఎత్తున పోలీసులు మోహరించారని, వారికి సూచనలు చే యాలని డీఎస్పీలకు ఆదేశించారు. గ్రేహౌండ్స్‌ బలగాలతో లేపాక్షిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. సమీక్షలో పుట్టపర్తి డీఎస్పీ య శ్వంత, కదిరి డీఎస్పీ భవ్యకిషోర్‌, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

రహదారి భద్రతపై ఎస్పీ సమీక్ష

మడకశిర రూరల్‌: జీ-20 దేశాల ప్రతినిధులు పావగడలో మంగళవా రం పర్యటించనున్నారు. అందులో భాగంగా అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప రహదారి భద్రతపై సమీక్షించారు మడకశిర నుంచి పావగడ వరకు రోడ్డు భద్రతను పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు.

పోలీసు సిబ్బందితో సమావేశం

లేపాక్షి: స్థానిక దుర్గా వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించడానికి మంగళవారం జీ-20 దేశాల సభ్యులు 60 మంది అత్యున్నత అధికార బృం దం పర్యటిస్తున్నట్లు డీఎస్పీ యశ్వంత తెలిపారు. ఈసందర్భంగా సోమవా రం స్థానిక ఆర్‌జేహెచ ఫంక్షన హాల్‌లో పోలీసు సిబ్బందితో సమావేశం ఏ ర్పాటు చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ కొడికొండ చెక్‌పోస్టు నుంచి మడకశి ర వరకు 400 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. ఆలయం వద్ద ర్యాపిడ్‌ పోలీసులతో పూర్తి భద్రతా ఏర్పాట్లు చేపట్టామన్నారు. విదేశీ బృందం ప్రవేశించినప్పటి నుంచి వారు తిరిగి వెళ్లేంతవరకు భద్రత కట్టుదిట్టం చేస్తామన్నారు. వారు తిరిగి ప్రయాణం అయ్యేవరకు ఆలయంలోకి ఎవరినీ అనుమతించమన్నారు. పురావస్తుశాఖ సిబ్బంది ఆలయాన్ని అందంగా అలంకరించారు. వారి రాకను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆలయ ప్రధాన దారిలో రోడ్డుకు ఇరువైపులా కర్టనలు ఏర్పాటు చేశారు. ఆలయం వెలుపల రెడ్‌, గ్రీన కార్పెట్లను ఏర్పాటు చే శారు. ప్రధాన రహదారిలో బస్సుల నిలుపుదల నిషేధించామన్నారు.

Updated Date - 2023-02-06T23:19:48+05:30 IST