టాటాఏస్‌ వ్యానను ఢీకొట్టిన కారు

ABN , First Publish Date - 2023-02-02T00:05:44+05:30 IST

ముందువెళ్తున్న టాటా ఏస్‌ వాహనాన్ని ఓవర్‌టెక్‌ చేసే క్రమంలో ఓ కారు ఢీకొని నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మ రో బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి.

టాటాఏస్‌ వ్యానను ఢీకొట్టిన కారు

ఐదుగురికి గాయాలు

ధర్మవరంరూరల్‌, ఫిబ్రవరి1: ముందువెళ్తున్న టాటా ఏస్‌ వాహనాన్ని ఓవర్‌టెక్‌ చేసే క్రమంలో ఓ కారు ఢీకొని నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మ రో బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. ధర్మవరం మండలంలోని సీతారాంపల్లి వద్ద బుధవారం 44వ జాతీయరహదారిపై చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.... మామిళ్లపల్లి పూసల కాలనీ వద్ద నెలవారీ కంతులకు సామగ్రిని ఇచ్చే వారు గుడెసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. వ్యాపారంలో భాగంగా తమ టాటాఏస్‌ వ్యానలో డ్రైవర్‌ కుళ్లాయప్ప, శ్రీదేవి, వన్నూరమ్మ, కదిరమ్మతో పాటు వారికి చెందిన చిన్నారి రాజు కలిసి నెలవారీ కంతులకు సరుకులు ఇచ్చిన వారితో వసూళ్లు చేసుకునేందుకు మామిళ్లపల్లి నుంచి చెన్నేకొత్తపల్లికి వెళుతున్నారు. అలాగే పెనుకొండకు చెందిన జయపోతిరెడ్డి ఏపీ02బీబీ 6899 నంబరు కారులో కుటుంబ సభ్యులతో కలిసి అనంతపురంలో పెళ్లికి వెళ్లి తిరిగి పెనుకొండకు వెళుతున్నా డు. సీతారంపల్లి వద్ద ముందు వెళుతున్న టాటాఏస్‌ వ్యానను ఓవర్‌టెక్‌ చేసే క్రమంలో కారు వెనుకవైపు నుంచి వేగంగా ఢీకొంది. దీంతో కారు ముందు భాగం దెబ్బతినగా టాటాఏస్‌ వ్యాన పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు చెల్లాచెదురుగా పడిపోయారు. తీవ్రంగా గాయపడ్డారు. చిన్నారి రాజు స్వల్పంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న కనగానపల్లి ఎస్‌ఐ హనుమంతరెడ్డి అక్కడికి వచ్చి గాయపడ్డ వారిని హైవే అంబులెన్సలో అనంతపురంప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ధర్మవరం రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అటుగా వెళుతున్న జడ్పీచైర్‌పర్సన బోయగిరిజమ్మ ప్రమాద సంఘటన చూసి గాయపడ్డవారిని పరామర్శించారు.

Updated Date - 2023-02-02T00:05:48+05:30 IST