శేష వాహనంపై శ్రీవారి విహారం

ABN , First Publish Date - 2023-02-02T00:43:07+05:30 IST

భక్తుల ఇలువేల్పు కొండమీదరాయుడు స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.

శేష వాహనంపై శ్రీవారి విహారం

బుక్కరాయసముద్రం, ఫిబ్రవరి1: భక్తుల ఇలువేల్పు కొండమీదరాయుడు స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారు బుధవారంశేష వాహనంపై భక్తులకు దర్శ నం ఇచ్చారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా నాల్గోవ రోజు శేష వాహన సేవకు ముందు స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామి వారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని పల్లకీ సేవలో గ్రామ వీధుల్లో ఉరేగించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్య లో స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామి వారు హనుమద్వాహనముపై విహరించనున్నట్లు ఆలయకమిటీ సభ్యులు తెలిపారు.

Updated Date - 2023-02-02T00:43:09+05:30 IST