సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

ABN , First Publish Date - 2023-01-26T00:29:32+05:30 IST

పని ఒత్తిడి భరించలేక బొమ్మనహాళ్‌కు చెందిన కాండ్రా అశోక్‌(26) అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు, బొమ్మనహాళ్‌కు చెందిన కె కృష్ణమూర్తికి పెద్ద కుమారుడు అశోక్‌ కర్నూలులో ఇంజనీరింగ్‌ పూర్తి చేసి, బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేశాడు.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య
అశోక్‌ (ఫైల్‌)

బొమ్మనహాళ్‌, జనవరి 25: పని ఒత్తిడి భరించలేక బొమ్మనహాళ్‌కు చెందిన కాండ్రా అశోక్‌(26) అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు, బొమ్మనహాళ్‌కు చెందిన కె కృష్ణమూర్తికి పెద్ద కుమారుడు అశోక్‌ కర్నూలులో ఇంజనీరింగ్‌ పూర్తి చేసి, బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేశాడు. కొంతకాలం క్రితం బ్యాంకు, లేదా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని తిరిగి వచ్చేశాడు. నంద్యాలలో శిక్షణ తీసుకున్నా ఉద్యోగం రాలేదు. దీంతో న్యూఢిల్లీలో ఓ ప్రైవేట్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా చేరాడు. ఎనిమిది నెలల నుంచి వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్నాడు. పని ఒత్తిడి ఎక్కువగా ఉందని తరచూ కుటుంబ సభ్యులవద్ద బాధపడేవాడు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం గ్రామ సమీపంలోని కాలువగట్టు వద్ద పురుగుల మందు తాగాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బళ్లారి విమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని ఏఎ్‌సఐ రమణ తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏఎ్‌సఐ తెలిపారు.

Updated Date - 2023-01-26T00:29:32+05:30 IST