ఏడుగురు మట్కా నిర్వాహకుల అరెస్ట్
ABN , First Publish Date - 2023-01-25T00:15:12+05:30 IST
గ్రామీణ ప్రాంతాల్లో డబ్బు ఆశ చూపి మట్కా రొంపిలో దింపి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఏడుగురు మట్కా నిర్వాహకులను అరెస్టు చేసినట్లు డీ ఎస్పీ హుస్సెన పీరా తెలిపారు.

రూ.2.01 లక్షల నగదు, సెల్ఫోన్లు స్వాధీనం
మడకశిర టౌన, జనవరి 24: గ్రామీణ ప్రాంతాల్లో డబ్బు ఆశ చూపి మట్కా రొంపిలో దింపి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఏడుగురు మట్కా నిర్వాహకులను అరెస్టు చేసినట్లు డీ ఎస్పీ హుస్సెన పీరా తెలిపారు. మంగళవారం మడకశిర సర్కిల్ కా ర్యాలయంలో ఆయన కేసు వివరాలు విలేకరులకు వెల్లడించారు. మ డకశిర, గుడిబండ మండలాల పరిధిలోని కుమ్మరనాగేపల్లి ప్రాథమిక పాఠశాల సమీప కాలనీలో మట్కా నిర్వాహకులు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సిబ్బంది మెరుపు దాడి చేసి మట్కా నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నా రు. కుమ్మరనాగేపల్లికి చెందిన రాజ్‌కుమార్ వద్ద రూ.1.30 లక్షలు, నారాయణప్ప వద్ద రూ.9 వేలు, హిరేతూర్పి తిప్పేస్వామి వద్ద రూ. 18 వేలు, కుగిరిన పాళ్యం గోవిందరాజులు వద్ద రూ.17,500, అదే కా లనీకి చెందిన రాజు వద్ద రూ.9,500, అమరాపురం మండలం హే మావతి నరసింహమూర్తి వద్ద రూ.9,700, హిరేతుర్పి సిద్దప్ప వద్ద రూ.7350 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మొత్తం రూ.2.01 లక్ష నగదు, ఏడు సెల్ఫోన్లు, మట్కా పట్టీలు స్వాధీనం చే సుకున్నామన్నారు. దాడుల్లో సీఐ సురేశ బాబు, గుడిబండ ఎస్ఐ మునిప్రతాప్, సిబ్బంది వెంకటేశ, దిలీప్, లక్ష్మికాంత, మహ్మద్‌రఫీ పాల్గొన్నట్లు తెలిపారు.