ఘనంగా ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాలు

ABN , First Publish Date - 2023-01-25T00:18:15+05:30 IST

మండలంలోని ఆమిదాలగొంది గ్రామంలో మం గళవారం దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంత్యుత్సవాలను టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాలు

మడకశిర రూరల్‌, జనవరి 24: మండలంలోని ఆమిదాలగొంది గ్రామంలో మం గళవారం దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంత్యుత్సవాలను టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర ఉ పాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్థానికులు ఆయ న్ను గజమాలతో స్వాగతించారు. అనంతరం ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి మాట్లాడారు. జగనరెడ్డి ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజా సంక్షేమాన్ని విస్మరించారని విమర్శించారు. చంద్రబాబునాయుడుతోనే రాషా్ట్రభివృద్ధి సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటువేసి గెలిపించాలని ప్ర జలకు పిలుపునిచ్చారు. ఈసందర్భంగా మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వర్ధంతిని పురస్కరించుకుని చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాల ను ఇంటింటా వివరిస్తూ, కరపత్రాలు పంపిణీ చేశారు. పంచాయతీకి చెందిన వైసీపీ నాయకులు గోవింద, అశ్వర్థప్ప ఈశ్వర్‌, నారాయణప్ప తదితరులు టీడీపీ తీర్థం పు చ్చుకున్నారు. వారికి గుండుమల పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివామూర్తి, మండల కన్వీనర్‌ లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి కోట ్లరంగేగౌడ్‌, క్లస్టర్‌ ఇనచార్జిలు నాగరాజు, కన్నా, నాయకులు నాగభూషణ్‌రెడ్డి, గిరి. లోకే్‌ష, రామచంద్ర, సుబ్బరాయుడు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:18:22+05:30 IST