ముఖ హాజరు వేయాల్సిందే: కలెక్టర్‌

ABN , First Publish Date - 2023-02-06T23:56:05+05:30 IST

అన్ని శాఖల ఉద్యోగులు ముఖ హాజరు వేయాల్సిందేనని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కలెక్టర్‌ నాగలక్ష్మి సీరియ్‌సగా ఆదేశించారు.

ముఖ హాజరు వేయాల్సిందే: కలెక్టర్‌

అనంతపురం టౌన, ఫిబ్రవరి 6: అన్ని శాఖల ఉద్యోగులు ముఖ హాజరు వేయాల్సిందేనని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కలెక్టర్‌ నాగలక్ష్మి సీరియ్‌సగా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని శాఖల కార్యాల యాల్లో ముఖ ఆధారిత హాజరును తీసుకొచ్చిందన్నారు. గత నెలలోనే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. అయితే ఇంకా చాలా శాఖల నుంచి ఉద్యోగులు ముఖ హాజరు వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అన్ని శాఖల ఉద్యోగులతో యాప్‌ను డౌనలోడ్‌ చేయించి రిజిస్టర్‌ చేయించాలన్నారు. ఆయా శాఖల జిల్లా అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జేఎనటీయూ, ఇంటర్‌ డిగ్రీ, హౌసింగ్‌, పోలీస్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, అటవి తదితర శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులు సిబ్బందితో వెంటనే ఎనరోల్‌ చేయించాలని ఆదేశించారు. ఏదైనా సాంకేతిక సమస్యలు ఉంటే ఎనఐసీ వారిని సంప్రదించి పరిష్కరించుకోవాలన్నారు. ఈ విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం చేసినా సహించేదిలేదన్నారు. అన్ని శాఖలలోనూ వందశాతం ముఖ హాజరు నమోదు కావాలని సూచించారు.

Updated Date - 2023-02-06T23:56:06+05:30 IST