దోపిడీ పాలనకు చరమగీతం పాడుదాం: బీకే

ABN , First Publish Date - 2023-01-26T00:33:48+05:30 IST

రాష్ట్రంలో ఇసుక, మట్టి, మద్యం అమ్మకాల్లో దోపిడీ చేస్తున్న వైసీపీ పాలనకు చరమగీతం పాడుదామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి పిలుపునిచ్చారు.

దోపిడీ పాలనకు చరమగీతం పాడుదాం: బీకే

రొద్దం, జనవరి 25: రాష్ట్రంలో ఇసుక, మట్టి, మద్యం అమ్మకాల్లో దోపిడీ చేస్తున్న వైసీపీ పాలనకు చరమగీతం పాడుదామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని ఎం.కొత్తపల్లి, గౌరాజుపల్లిలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన బీకే మాట్లాడుతూ.. వైసీపీ అవినీతి పాలనతో జనం విసుగెత్తిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం లేదన్నారు. కక్షలు, కార్పణ్యాలతో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. నారా లోకేశ పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తే ప్రజలే.. ప్రభుత్వానికి బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రొద్దం నరసింహులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:33:48+05:30 IST