ఉత్తమ కండెక్టర్‌గా లక్ష్మీనరసమ్మ

ABN , First Publish Date - 2023-01-25T00:06:45+05:30 IST

ఆర్టీసీలోని మూడు రంగాలలో విశిష్ట సేవలు అందించి కండెక్టర్‌గా లక్ష్మీనరసమ్మ ఎంపికయ్యారు.

ఉత్తమ  కండెక్టర్‌గా లక్ష్మీనరసమ్మ

కదిరి అర్బన, జనవరి 23 : ఆర్టీసీలోని మూడు రంగాలలో విశిష్ట సేవలు అందించి కండెక్టర్‌గా లక్ష్మీనరసమ్మ ఎంపికయ్యారు. ఏకంగా మూడు రంగాలలో ఉత్తమ ఆదాయం, (ప్రతి కిలోమీటరుకు (రూ.42.35), మదనపల్లి రూట్‌లో అత్యధిక ఆదాయం (రూ.42.19) తో ఉత్తమ మహిళా కండక్టరుగా లక్ష్మీనరసమ్మ 2022లో నిలిచినట్లు డిపో మేనేజర్‌ మైనోద్దీన, అసిస్టెంట్‌ మేనేజర్‌ హరిమోహన పేర్కొన్నారు. ఆమెను గురువారం రిపబ్లిక్‌ డే వేడుకలలో ఏపీఎస్‌ ఆర్‌టీసీ కదిరి డిపో ఆధ్వర్యంలో సత్కరించనున్నట్లు చెప్పారు. ఆమెను అసిస్టెంట్‌ మేనేజర్లు హరిమోహన, హరిత, రామకృష్ణ, తోటి కార్మికులు అభినందించారు.

Updated Date - 2023-01-25T00:06:45+05:30 IST