కోర్టులో జగనను దోషిగా నిలుపుతాం

ABN , First Publish Date - 2023-02-06T23:49:55+05:30 IST

పేదలకు లబ్ధి చేకూర్చే పథకాలను రద్దు చేస్తే జగనను న్యాయస్థానంలో దోషిగా నిలబెడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్‌ హెచ్చరించారు.

కోర్టులో జగనను దోషిగా నిలుపుతాం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్‌

అనంతపురం విద్య, ఫిబ్రవరి 6: పేదలకు లబ్ధి చేకూర్చే పథకాలను రద్దు చేస్తే జగనను న్యాయస్థానంలో దోషిగా నిలబెడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్‌ హెచ్చరించారు. సోమవారం జగనన్న ఇళ్లు, టిడ్కో ఇళ్ల లబ్ధిదారులతో కలిసి కలెక్టరేట్‌ వద్ద సీపీఐ నాయకులు నిరసన తెలిపారు. అనంతపురం అర్బన, రాప్తాడు, శింగనమల నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున లబ్ధిదారులు నిరసనకు పోటెత్తారు. ఈ సందర్భంగా జగనన్న ఇళ్ల వద్ద సదుపాయాలు కల్పించాలని, ఇళ్ల నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఏమాత్రం సరిపోవని, రూ. 5 లక్షలు ఇవ్వాలంటూ లబ్ధిదారులు వినతులు ఇస్తుంటే వలంటీర్లు వారిని బెదిరించడం ఏంటని మండిపడ్డారు. వలంటీర్లు యమకింకరుళ్లా మారి ఇళ్ల స్థలాలు, రేషనకార్డులు రద్దు చేస్తామని, అమ్మఒడి, చేదోడు వంటివి రద్దు చేస్తామంటూ హెచ్చరిస్తున్నార న్నారు. పేదల సేవకు నియమితులైన వలంటీర్లు జగనన్నకు ఊడిగం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి నిరంకుశత్వం విడనాడాల న్నారు. లబ్ధిదారుల ఇబ్బందులు ప్రభుత్వానికి తెలియాలనే కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 22న లక్షలాది మంది లబ్ధిదారులతో చలో విజయవాడ నిర్వహిస్తామని పేర్కొన్నారు. పేదలకు లబ్ధి చేకూర్చే జగనన్న ఇళ్లు, టిడ్కో ఇళ్లు, అమ్మఒడి ఇతర పథకాలను ఆపితే సుప్రీం కోర్టు వరకైనా వెళ్లి జగనను దోషిగా నిలబెడతామంటూ హెచ్చరించారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్‌, జిల్లా సహాయకార్యదర్శులు నారాయణస్వామి, మల్లికార్జున, జిల్లా కార్యవర్గ సభ్యులు కేశవరెడ్డి, నారాయణస్వామి, నగర కార్యదర్శి శ్రీరాములు, రాప్తాడు కార్యదర్శి రామక్రిష్ణ, ఇతర నేతలు రమణ, పద్మావతి, రాజే్‌షగౌడ్‌, సంతో్‌షకుమార్‌, నాగరాజు, ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా అధ్యక్షులు కుళ్లాయ్‌స్వామి, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌కుమార్‌, నగర సహాయకార్యదర్శి అల్లిపీరా పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:49:56+05:30 IST