క్రిమిసంహారక మందులతో అధిక ఖర్చులు: ఏడీఏ

ABN , First Publish Date - 2023-02-02T00:36:03+05:30 IST

రైతులు అనవసరంగా క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడం వలన ఖర్చు లు అధికమవుతాయని ఏడీఏ వెంకటరాముడు తెలిపారు.

క్రిమిసంహారక మందులతో అధిక ఖర్చులు: ఏడీఏ

అనంతపురంరూరల్‌, ఫిబ్రవరి 1: రైతులు అనవసరంగా క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడం వలన ఖర్చు లు అధికమవుతాయని ఏడీఏ వెంకటరాముడు తెలిపారు. బుధవారం మండలంలోని నరసనాయునికుంట గ్రామంలో పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఏడీఏ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పొలంబడి పద్ధతిని రైతులు పాటించినట్లయితే తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలు పొందవచ్చునన్నారు. రసం పీల్చే పురుగులకు ఎల్లో ట్రాప్స్‌, బ్లూ ట్రాప్స్‌ పెట్టి నివారించుకోవచ్చునన్నారు. జీవన రేఖ కార్యక్రమంలో భాగంగా రైతులకు పంట రుణాలు, పంట బీమా, పంట నష్టపరిహారం తదితర వాటిని ఇస్తామన్నారు. కౌలు రైతులు సీసీఆర్‌సీ కార్డులు చేయించుకోవాలన్నారు. కేవీకే రెడ్డిపల్లి శాస్త్రవేత్త రవి కిశోర్‌ మాట్లాడుతూ పేనుబంకను నివారించడానికి ఇమిడాక్లోప్రిడ్‌ లేదా అసిటాంప్రిడ్‌ మందును పిచికారి చేయాలని సూచించారు. ఆకుమచ్చ తెగులు నివారణకు కాంట్‌ఫతో పాటు హెక్సాకోనజోల్‌ మందును పిచికారి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఓ వెంకటేశ్వరప్రసాద్‌, ఏఈఓ ప్రసాద్‌, మురళీ, వీహెచఏలు, వీవీఏలు, వీఎ్‌సఏలు, ఎంపీఈఓలు, ఆర్‌డబ్ల్యుఈపీ విద్యార్ధులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T00:36:04+05:30 IST