రైతుకు కరెంటు కష్టాలు

ABN , First Publish Date - 2023-02-02T00:09:09+05:30 IST

ఖరీఫ్‌లో దెబ్బతిన్న రైతు రబీలోనైనా గట్టెక్కుదామనుకుంటే ఇప్పుడు కూడా సమస్యలు ఎదురవుతున్నాయి.

రైతుకు కరెంటు కష్టాలు

ముదిగుబ్బ, ఫిబ్రవరి1: ఖరీఫ్‌లో దెబ్బతిన్న రైతు రబీలోనైనా గట్టెక్కుదామనుకుంటే ఇప్పుడు కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. అప్పులు పంటలు సాగుచేసిన రైతన్నను కరెంటు కష్టాలు వెంటాడుతున్నా యి. ముదిగుబ్బ మండలంలో రబీకింద దాదాపు మూడు వేల ఎకరాల్లో వేరుశనగ సాగుచేశారు. ఆ రైతు లకు విద్యుత సమస్య కొరకరాని కొయ్య గా తయారైంది. లో ఓల్టేజ్‌ కారణంగా సక్రమంగా నీరు అందక పంట వాడుముఖం పడుతోంది. ముదిగుబ్బ విద్యుత సబ్‌స్టేషన పరిధిలోని దొరిగిల్లు ఫీడరు కింద ఉన్న గ్రామాలకు విద్యుత సరఫరా అరకొరగా అవడంతో పాటు లో ఓల్టేజ్‌ సమస్య నెలకొంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రదానంగా కొండగట్టుపల్లి పంచాయతీ లోని పాముదుర్తికొట్టాల, ఎం కొట్టాల, ఎనఎస్పీ కొట్టాల, ఏబీపల్లితండా పరిధిలోని పలు గ్రామాలలో లో ఓల్టేజ్‌ సమస్యతో పంటలు ఎండిపోతు న్నట్టు వేరుశనగరైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పలు సాంకేతిక కారణాలసాకుతో వ్యవసాయానికి మూడు, నాలుగు గంటలే సరఫరా చేస్తున్నారని రైతులు వాపోయారు. వేరుశనగపంట చేతికొచ్చే సమయానికి వేసవికాలం వస్తుందని, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళ చెందుతున్నారు. ఈ క్రమంలో ఆయా గ్రామాలకు చెందిన రైతులు రెండు రోజులక్రితం విద్యుత సబ్‌స్టేషన ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపడితే... సక్రమంగా విద్యుతసరఫరా చేస్తామని అఽధి కారులు హామీ ఇచ్చినా పరిస్థితిలో మార్పులేదని రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా ఈ గ్రామాలకు లైనమ్యాన లేక పోవడంతో రైతులకు ఇబ్బందిగా ఉందని వారంటున్నారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న లైనమ్యాన అధికార పార్టీ నాయకులకు సహకరించకపోవడంతో పట్టుబట్టి బదిలీచేయించారనే విమర్శలు వినిపి స్తున్నాయి. ఏదిఏమైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వ్యవసాయానికి విద్యుత సమస్యను పరిష్కరించాలని రైతులుకోరుతున్నారు.

అధిక లోడు వల్ల విద్యుత సమస్యలు - చంద్రానాయక్‌, ట్రాన్సకో ఏఈ

అధిక లోడు వల్ల విద్యుత సమస్యలు తలెత్తుతున్నాయి. లోడ్‌ డైవర్ట్‌ పద్ధతి ద్వారా వ్యవసాయ రైతులకు ఎలాంటి అంతరాయంలేకుండా విద్యుత సరఫరా చేస్తున్నాం. దొరిగిల్లు, మంగలమడకలలో నూతన విద్యుత సబ్‌స్టేషన కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపాం. సబ్‌స్టేషన మంజూరైతే శాశ్వత పరిష్కారలం లభిస్తుంది.

Updated Date - 2023-02-02T00:09:11+05:30 IST