పరిశ్రమలో విద్యుత ప్రమాదం

ABN , First Publish Date - 2023-02-06T23:22:19+05:30 IST

మండలంలోని కొత్తూరు సమీపాన కియ అనుబంధ పీఎనకే పరిశ్రమ కొత్త షెడ్డు నిర్మాణ పను ల్లో సోమవారం విద్యుత ప్రమాదం సం భవించింది. కార్మికుడు హరిక్రిష్ణ (33) మృతి చెందాడు.

పరిశ్రమలో విద్యుత ప్రమాదం

కార్మికుడి మృతి

మరొకరికి తీవ్రగాయాలు

గోరంట్ల, ఫిబ్రవరి 6: మండలంలోని కొత్తూరు సమీపాన కియ అనుబంధ పీఎనకే పరిశ్రమ కొత్త షెడ్డు నిర్మాణ పను ల్లో సోమవారం విద్యుత ప్రమాదం సం భవించింది. కార్మికుడు హరిక్రిష్ణ (33) మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాలివి. ఫ్యాక్టరీలో నాలుగో షెడ్డు నిర్మాణంలో ఉంది. నందిని వేర్‌హౌస్‌ పైకప్పు ఇనుప రేకులు పరుస్తున్నారు. ఈ రేకులకు మిషన సాయంతో బాపట్ల జిల్లా జంపని గ్రామానికి చెందిన సాంబయ్య కుమారుడు హరిక్రిష్ణ స్ర్కూలు బిగిస్తుండగా, విద్యుతషాక్‌తో అక్కడికక్కడే మృతిచెందాడు. అతనితో పాటు పనిచేస్తున్న మరో కార్మికుడు గోపీ తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు. పైకప్పు స్ర్కూలు బిగిస్తున్న మిషన కరెంటు వైరు తెగి రేకుకు విద్యుత ప్రసారమై షాక్‌ కొట్టింది. సంఘటనా స్థలాన్ని సీఐ సుబ్బరాయుడు పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో పీఎనకే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు రాత్రివేళల్లో పనిచేస్తూ యంత్రాలకు సెన్సార్‌లు బిగించకపోవడంతో ప్రమాదాలు సంభవించి చేతులు, వేళ్లు తెగి గాయపడిన విషయం తెలిసిందే. పరిశ్రమలో మిషన్లకు సెన్సార్‌లు బిగించాలంటూ బాధితులు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పరిశ్రమ ఎదుట ఆందోళన చేసిన విషయం తెలిసిందే. తాజా ఘటనతో కార్మికుల్లో ఆందోళన నెలకుంది.

Updated Date - 2023-02-06T23:22:23+05:30 IST