వైసీపీ పాలనలో సేవాఘడ్‌ ఉత్సవాలకు నిధుల కరువు

ABN , First Publish Date - 2023-02-06T23:20:56+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సేవాలాల్‌ జయంతి ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి నిధుల కరువు ఏర్పడిందని సేవాఘడ్‌ ట్రస్టు ఉపాధ్యక్షుడు కేశవనాయక్‌, ప్రధాన కార్యదర్శి అశ్వత్థనాయక్‌, కోశాధికారి రవీంద్రనాయక్‌ పేర్కొన్నారు.

వైసీపీ పాలనలో సేవాఘడ్‌ ఉత్సవాలకు నిధుల కరువు
నూతనంగా ఎన్నికైన ఏఐబీఎస్‌ఎస్‌ జిల్లా కార్యవర్గం

సేవాఘడ్‌ ట్రస్టు కార్యవర్గం

అనంతపురం కల్చరల్‌, ఫిబ్రవరి 6: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సేవాలాల్‌ జయంతి ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి నిధుల కరువు ఏర్పడిందని సేవాఘడ్‌ ట్రస్టు ఉపాధ్యక్షుడు కేశవనాయక్‌, ప్రధాన కార్యదర్శి అశ్వత్థనాయక్‌, కోశాధికారి రవీంద్రనాయక్‌ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని బంజారా భవనలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఈనెల 13న సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిఏటా ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి రూ.25లక్షలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక నిధులు ఇవ్వకపోవడం విచారకరమన్నారు. సేవాలాల్‌ మహరాజ్‌ దేవాలయాల నిర్మాణాలకు, అభివృద్ధికి కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు రూ.కోట్లు మంజూరు చేస్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో ఏఐబీఎ్‌సఎస్‌ ఉమ్మడి అనంతపురం జిల్లా నాయకులు రంగ్లానాయక్‌, బాలానాయక్‌, రంగానాయక్‌ పాల్గొన్నారు.

నూతన కమిటీ ఎన్నిక : సమావేశంలో భాగంగా ఆల్‌ ఇండియా బంజారా సేవాసం్‌ఘ(ఏఐబీఎ్‌సఎస్‌) అనంతపురం జిల్లా నూతన కమిటీ ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాఘడ్‌ ట్రస్టు ఉపాధ్యక్షుడు కేశవనాయక్‌, ప్రధాన కార్యదర్శి అశ్వర్థనాయక్‌, ఏఐబీఎ్‌సఎస్‌ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటరమణనాయక్‌, చక్రేనాయక్‌ల నేతృత్వంలో ఏఐబీఎ్‌సఎస్‌ జిల్లా అధ్యక్షుడుగా బాలాజినాయక్‌, ప్రధాన కార్యదర్శిబా బాబునాయక్‌, కోశాధికారిగా నారాయణస్వామినాయక్‌, గౌరవాధ్యక్షుడుగా అశ్వర్థనాయక్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడుగా వెంకటరమణ, ఉపాధ్యక్షుడుగా కిరణ్‌కుమార్‌, సహాయ కార్యదర్శులుగా సుగుణబాయి, శివమణిబాయి, ఉమాబాయిలను ఎన్నుకున్నారు.

Updated Date - 2023-02-06T23:20:58+05:30 IST