ఉత్సవ విగ్రహానికి అలంకరణ

ABN , First Publish Date - 2023-01-26T00:32:03+05:30 IST

కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో బుధవారం ఉదయం పూర్వాభాద్ర నక్షత్ర సంక్రమణం సందర్భంగా మన్యుశూక్త హోమాన్ని నిర్వహించారు

ఉత్సవ విగ్రహానికి అలంకరణ

గుంతకల్లు, జనవరి 25: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో బుధవారం ఉదయం పూర్వాభాద్ర నక్షత్ర సంక్రమణం సందర్భంగా మన్యుశూక్త హోమాన్ని నిర్వహించారు. ఆలయ యాగశాలలో ఆంజనేయస్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, తులసి ఆకులు, పూల మాలలతో అలంకరించారు. సీతారాముల చిత్రపటాలను ఏర్పాటు చేసి మన్యుశూక్త హోమాన్ని శాసో్త్రక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:32:03+05:30 IST