మండల సమాఖ్య పదవిపై రచ్చ

ABN , First Publish Date - 2023-01-25T00:16:51+05:30 IST

మండల అధికార పార్టీలో ప దవుల పంపకం రచ్చకెక్కుతోంది. వర్గాలుగా విడిపోయి వాగ్వాదాల కు దిగుతున్నారు. మంగళవారం ఇరువురు నాయకులు ఏకంగా స్థా నిక ఎంపీడీఓ కార్యాలయంలోనే నిలదీతలకు దిగడంతో అక్కడున్న వారు అవాక్కయ్యారు.

మండల సమాఖ్య పదవిపై రచ్చ

ఎంపీడీఓ కార్యాలయంలో నాయకుల వాగ్వాదం?

పెనుకొండ రూరల్‌, జనవరి 24: మండల అధికార పార్టీలో ప దవుల పంపకం రచ్చకెక్కుతోంది. వర్గాలుగా విడిపోయి వాగ్వాదాల కు దిగుతున్నారు. మంగళవారం ఇరువురు నాయకులు ఏకంగా స్థా నిక ఎంపీడీఓ కార్యాలయంలోనే నిలదీతలకు దిగడంతో అక్కడున్న వారు అవాక్కయ్యారు. మండలంలోని శెట్టిపల్లికి చెందిన వైసీపీ కా ర్యకర్త ఒకరు, ఎంపీపీ భర్తపై ఫైర్‌ అయినట్లు సమాచారం. గ్రామా నికి చెందిన ఒక కార్యకర్త భార్య ఇదివరకు మండల సమైఖ్యలో ఎం హెచవీఓ పదవిలో కొనసాగారు. రెండేళ్ల కాలపరిమితి ముగియడం తో ఆ పదవిలో మరో మహిళతో భర్తీ చేసేందుకు ప్రయత్నాలు సా గినట్లు తెలిసింది. దీంతో మింగుడు పడని ఆ కార్యకర్త ఏకంగా ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చి ఎంపీపీ భర్తతో తీవ్రస్థాయిలో వా గ్వాదానికి దిగినట్లు చర్చ జరుగుతోంది. భార్య ఎంపీపీ అయితే, ఆ కుర్చీలో నువ్వెందుకు కూర్చున్నావని ప్రశ్నించినట్లు తెలిసింది. నీకు అనుకూలంగా ఉన్నవారికే పనులు చేస్తున్నావంటూ మండిపడినట్లు ఆపార్టీలో చర్చ జరుగుతోంది. వీరి మధ్య వాగ్వాదం అధికార పార్టీ లో చర్చనీయాంశంగా మారింది. అక్కడున్న వారు సర్దిచెప్పి పంపా రు. దీనిపై ఎంపీపీ భర్త రామ్మోహనరెడ్డిని వివరణ కోరగా, శెట్టిపల్లికి చెందిన సుధాకర్‌ ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్న తనను సం బంధం లేని విషయాలపై మాట్లాడినట్లు తెలిపారు.

‘పార్టీ కోసం కష్టపడిన వారికే గుర్తింపులేదు..’

గుడిబండ: మడకశిర నియోజకవర్గంలో వైసీపీకి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి తగిన గుర్తింపు ఇ వ్వడం లేదని ఆపార్టీ మండల నాయకులు ఎల్‌కే నరసింహప్ప, ఉడదహళ్లి నాగరాజు ఆరోపించారు. మంగళవారం వారు స్థానికంగా వి లేకరులతో మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి స ముచితం స్థానం కల్పించడం లేదన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చి న వారికి పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే విజయానికి కష్టపడి పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా, మండల స్థాయి నాయకులను పక్కన పెట్టి ఎమ్మెల్యే రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సచివాలయ కన్వీనర్లను ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని ఎంపిక చేశారని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడిన వారిని గుర్తించలేకపోయారని వాపోయారు. పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించలేకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:16:51+05:30 IST