ఘనంగా గంగమ్మ దిష్టిబొట్టు జాతర

ABN , First Publish Date - 2023-01-25T00:11:55+05:30 IST

మండలంలోని నాయన కోట గ్రామంలోని వీరప్పగారిపల్లిలో మంగళవారం ఘనంగా గంగమ్మ దిష్టిబొట్టు జాతర కార్యక్రమం నిర్వహించారు.

ఘనంగా గంగమ్మ దిష్టిబొట్టు జాతర

ఓబుళదేవరచెరువు, జనవరి 24: మండలంలోని నాయన కోట గ్రామంలోని వీరప్పగారిపల్లిలో మంగళవారం ఘనంగా గంగమ్మ దిష్టిబొట్టు జాతర కార్యక్రమం నిర్వహించారు. మండలం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వందలాదిమంది భక్తులు తరలివచ్చారు. మహిళలు భక్తి శ్రద్ధలతో గంగమ్మకు బోనాలు, జ్యోతులు సమర్పించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హాజరై గంగమ్మను దర్శించుకున్నారు. పల్లెకు గ్రామస్థులు, నాయకులు స్వాగతం పలికారు. టీడీపీ మండల కన్వీ నర్‌ శెట్టివారి జయచంద్ర, నాయకులు ఆర్‌ఎంపీ జాకీర్‌, వైదేహి, గంగాద్రి, నాయనకోట ఆంజనేయులు, పొగాకు షబ్బీర్‌, గండికోట ఇర్షాద్‌, జయ చంద్రా రెడ్డి, కొండే ఈశ్వరయ్య, ఆంజనరెడ్డి, మస్తానమ్మ, అంగడి బాషా, మండోజీ ఆర్ఫీఖాన, సౌదీ నాగరాజు, రాయల్‌కుమార్‌, చండ్రాయుడు, రాష్ట్ర బోరు రమణ, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మారెమ్మ జాతర...

బుక్కపట్నం: మండల పరిధిలోని నారసింపల్లిలో వెలసిన మారెమ్మ జాతరను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే అర్చకుడు అమ్మవారిని ప్రత్యే కంగా అలంకరించి పూజలు చేశారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొని అమ్మవారికి పూజలు చేయించారు. చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

Updated Date - 2023-01-25T00:11:55+05:30 IST