Tirumala: వెంకన్నకు తలనీలాలిచ్చిన ఈయనెవరో తెలుసా?..

ABN, First Publish Date - 2022-11-11T19:00:04+05:30 IST

ఎప్పుడు గుబురు గడ్డం బారెడు జుట్టుతో కనిపించే ఆ నాయకుడు గుండుతో కనిపించేసరికి వైరల్‌ (viralvideo)గా మారింది. తిరుమలలో ఆయనను చూసినవారు..

హైదరాబాద్: ఎప్పుడు గుబురు గడ్డం బారెడు జుట్టుతో కనిపించే ఆ నాయకుడు గుండుతో కనిపించేసరికి వైరల్‌ (viralvideo)గా మారింది. తిరుమలలో ఆయనను చూసినవారు.. ఆయన్ను ఎక్కడో చూసినట్టుందే అనుకున్నారు. దగ్గరికి వెళ్లి పలకరించాకగానీ.. ఆయన్ను గుర్తు పట్టలేకపోయారు. ఆయనే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (jaggareddy) అని తెలుసుకొని ఆశ్చర్యపోయారు.

తెలంగాణ కాంగ్రెస్ (congress) నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తిరుమల శ్రీవారికి మొక్కు చెల్లించుకున్నారు. దేవదేవుడికి తలనీలాలు సమర్పించారు. గత కొన్ని ఏళ్ల నుంచి జగ్గారెడ్డి జుట్టు, గడ్డం పెంచారు. ఎప్పుడు పొడగాటి గడ్డంతో కనిపించే జగ్గారెడ్డి గుండు చేయించుకోవడంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఎప్పుడు గుబురు గడ్డం బారెడు జుట్టుతో కనిపించే ఆ నాయకుడు గుండుతో వైరల్‌గా మారారు.

Updated at - 2022-11-12T17:15:50+05:30

Read more