Ayyappa Mala: విద్యార్థి అయ్యప్ప మాల.. అనుమతించని హెడ్మాస్టర్

ABN, First Publish Date - 2022-11-23T18:20:23+05:30 IST

అయ్యప్ప మాలధారణ ధరించిన విద్యార్థిని పాఠశాలలోకి అనుమతించలేదు. మందమర్రి సింగరేణి పాఠశాల (Mandamarri Singareni School) లో ఈ ఘటన చోటుచేసుకుంది. మందమర్రి సింగరేణి పాఠశాలలో సూర్యతేజ (surya teja) అనే విద్యార్థి 10వ తరగతి చదువుతున్నాడు.

మంచిర్యాల: అయ్యప్ప మాలధారణ ధరించిన విద్యార్థిని పాఠశాలలోకి అనుమతించలేదు. మందమర్రి సింగరేణి పాఠశాల (Mandamarri Singareni School) లో ఈ ఘటన చోటుచేసుకుంది. మందమర్రి సింగరేణి పాఠశాలలో సూర్యతేజ (surya teja) అనే విద్యార్థి 10వ తరగతి చదువుతున్నాడు. సూర్యతేజ మాలధారణ ధరించాడు. హెడ్మాస్టర్ సుందర్‌రావు విద్యార్థిని క్లాస్ రూంలోకి అనుమతించలేదు. దీంతో సదరు విద్యార్థి విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తెచ్చాడు. అలాగే విషయం తెలుసుకున్న అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు పాఠశాలకు వెళ్లి హెడ్మాస్టర్‌ను నిలదీశారు.

Updated at - 2022-11-23T20:03:46+05:30