Ap news: ద్వారకాతిరుమలలో రెండు తలల పాము హల్‌చల్

ABN, First Publish Date - 2022-11-11T11:15:23+05:30 IST

ద్వారకాతిరుమలలో రెండు తలల పాము హల్‌చల్ చేసింది.

ఏలూరు: ద్వారకాతిరుమలలో రెండు తలల పాము హల్‌చల్ చేసింది. కారులో ఓ వ్యక్తి స్థానిక వసంత నగర్‌కు వెళుతుండగా రెండు తలల పాము కంటబడింది. సదరు వ్యక్తి ఈ విషయాన్ని స్థానికులకు తెలియజేశారు. వారు చూస్తుండగానే రెండు తలల పాము పక్కనే ఉన్న పెద్ద రంద్రంలోకి వెళ్లిపోయింది. కాగా.. రెండు తలలో కనిపించడం చాలా అరుదు... అందులోనూ అంత పెద్ద రెండు తలల పాము కనిపించేసరికి స్థానికులు భయాందోళన చెందారు. అయితే అది విష సర్పం కాదని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Updated at - 2022-11-11T18:26:35+05:30

Read more