థండాయి సిరప్‌

ABN , First Publish Date - 2022-05-13T21:44:35+05:30 IST

బాదం, పిస్తా- అర కప్పు, యాలకులు - పది, తర్బూజా విత్తనాలు- రెండు స్పూన్లు, సోంపు

థండాయి సిరప్‌

కావలసిన పదార్థాలు: బాదం, పిస్తా- అర కప్పు, యాలకులు - పది, తర్బూజా విత్తనాలు- రెండు స్పూన్లు, సోంపు గింజలు - రెండు స్పూన్లు, మిరియాలు- అర స్పూను, కేసరి- కాస్త, గుల్ఖండ్‌- రెండు స్పూన్లు, చక్కెర వంద గ్రాములు, నీళ్లు- పావు లీటరు.


తయారుచేసే విధానం: అన్ని పప్పులు, గింజల్ని వేడి నీళ్లలో అయిదు గంటలు నానబెట్టాలి. ఆ తరవాత నీళ్లని వడకట్టి పక్కనబెట్టాలి. పప్పులు, గుల్ఖండ్‌, కాస్త నానబెట్టిన నీటిని వేసి గ్రైండర్‌లో పేస్టులా చేసుకోవాలి. కడాయిలో చక్కెర, కుంకుమ పువ్వు నీటిని కలిపి తీగపాకం పట్టే వరకు వేడిచేయాలి. ఇందులో పప్పుల పేస్టు కూడా కలిపి పావు గంట ఉడికించి స్టవ్‌ కట్టేయాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. బాగా చల్లారాక ఇంకోసారి గ్రైండర్‌లో తిప్పి సీసాలో పోసి రెఫ్రిజిరేటర్‌లో పెట్టాలి. గ్లాసు నీళ్లలో స్పూను సిరప్‌ కలిపి చల్లచల్లని జ్యూస్‌లా ఎంజాయ్‌ చేస్తే సరి. ఇలా 15 రోజుల వరకూ వాడవచ్చు.

Read more