సోయా కట్‌లెట్స్‌

ABN , First Publish Date - 2022-05-21T18:18:54+05:30 IST

సోయా - ఒక కప్పు, నూనె - సరిపడా, ఉప్పు - తగినంత, అల్లం - చిన్న ముక్క, వెల్లుల్లి - ఐదారు రెబ్బలు, పచ్చిమిర్చి - రెండు, ఉల్లిపాయ - ఒకటి, పసుపు - పావు టీస్పూన్‌

సోయా కట్‌లెట్స్‌

కావలసినవి: సోయా - ఒక కప్పు, నూనె - సరిపడా, ఉప్పు - తగినంత, అల్లం - చిన్న ముక్క, వెల్లుల్లి - ఐదారు రెబ్బలు, పచ్చిమిర్చి - రెండు, ఉల్లిపాయ - ఒకటి, పసుపు - పావు టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, గరంమసాల - ఒక టీస్పూన్‌, కొత్తిమీర - ఒకకట్ట, బంగాళదుంపలు - రెండు, కార్న్‌ఫ్లోర్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, బ్రెడ్‌క్రంబ్స్‌ - కొద్దిగా.


తయారీ విధానం: స్టవ్‌పై ఒక పాత్రలో నీళ్లు పెట్టి వేడి చేయాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో సోయా బాల్స్‌ని వేయాలి. తరువాత బయటకు తీసి నీరు లేకుండా పిండాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి బ్లెండ్‌ చేసుకోవాలి. బంగాళదుంపలను ఉడికించి పొట్టు తీసి పెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి  అయ్యాక దంచిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి మరికాసేపు వేయించాలి. పసుపు, ధనియాల పొడి, కారం వేసుకోవాలి. గరంమసాల, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి.ఇప్పుడు బ్లెండ్‌ చేసి పెట్టుకున్న సోయా వేసి కలుపుకోవాలి. కాసేపు వేయించిన తరువాత బౌల్‌లోకి మార్చుకోవాలి. అందులో తరిగిన కొత్తిమీర, ఉడికించిన బంగాళదుంపలు వేసి కలుపుకోవాలి. బాగా కలిపిన తరువాత కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ కట్‌లెట్స్‌గా ఒత్తుకోవాలి. చిన్న బౌల్‌లో కార్న్‌ఫ్లోర్‌ వేసి కొన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. కట్‌లెట్స్‌ను ఈ కార్న్‌ఫ్లోర్‌ నీళ్లలో డిప్‌ చేస్తూ బ్రెడ్‌ క్రంబ్స్‌ అద్దాలి.స్టవ్‌పై పాన్‌పెట్టి నూనె పోసి వేడి అయ్యాక బ్రెడ్‌క్రంబ్స్‌ అద్దిన కట్‌లెట్స్‌ వేసి వేయించుకోవాలి.

Read more