పనీర్‌ కట్లెట్‌

ABN , First Publish Date - 2022-05-18T18:07:18+05:30 IST

పనీర్‌- రెండు కప్పులు, ఉడికించిన ఆలు- కప్పు, ఉల్లి ముక్కలు- రెండు స్పూన్లు, క్యారెట్‌ తురుము- అర కప్పు, పచ్చి మిర్చి ముక్కలు- అర స్పూను, అల్లం పేస్టు- అర

పనీర్‌ కట్లెట్‌

కావలసిన పదార్థాలు: పనీర్‌- రెండు కప్పులు, ఉడికించిన ఆలు- కప్పు, ఉల్లి ముక్కలు- రెండు స్పూన్లు, క్యారెట్‌ తురుము- అర కప్పు, పచ్చి మిర్చి ముక్కలు- అర స్పూను, అల్లం పేస్టు- అర స్పూను, కొత్తిమీర తురుము-  రెండు స్పూన్లు, గరం మసాలా- అర స్పూను, మొక్క జొన్న పిండి- రెండు స్పూన్లు, మిరియాల పొడి- పావు స్పూను, మైదా- రెండు స్పూన్లు, నూనె, ఉప్పు, నీళ్లు- తగినంత.


తయారుచేసే విధానం: పనీర్‌ను పొడిగా చేసుకోవాలి. పెద్ద గిన్నెలో పనీర్‌, ఆలు, ఉల్లి, క్యారెట్‌ తురుము, మిర్చి, అల్లం పేస్టు, కొత్తిమీర, గరం మసాలా, ఉప్పు బాగా కలిపి చిన్న చిన్న ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో మైదా, మొక్కజొన్న పిండి, మిరియాల పొడి, ఉప్పు, నీళ్లు కలిపి పేస్టులా చేసుకోవాలి. కూరగాయల ముద్దను మైదా పేస్టులో అద్ది నూనెలో వేయిస్తే సరి. ఫ్రై చేయడం ఇష్టం లేని వాళ్లు బేక్‌ చేసుకోవచ్చు. టొమాటో సాస్‌తో ఈ పనీర్‌ కట్లెట్‌ భలే రుచిగా ఉంటుంది.

Read more