పాలక్‌ రైతా

ABN , First Publish Date - 2022-04-23T18:58:16+05:30 IST

పెరుగు - అరకేజీ, పాలకూర - రెండు కట్టలు, పచ్చిమిర్చి - రెండు, జీలకర్ర పొడి - ఒక టీస్పూన్‌, మిరియాల పొడి - అర టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత.

పాలక్‌ రైతా

కావలసినవి: పెరుగు - అరకేజీ, పాలకూర - రెండు కట్టలు, పచ్చిమిర్చి - రెండు, జీలకర్ర పొడి - ఒక టీస్పూన్‌, మిరియాల పొడి - అర టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత.


తయారీ విధానం: ఒక పాత్ర తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి స్టవ్‌పై పెట్టి కట్‌ చేసిన పాలకూర వేసి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత నీళ్లు వంపేసి చల్లారబెట్టుకోవాలి.మరొక పాత్రలో పెరుగు తీసుకుని బ్లెండర్‌ సహాయంతో గడ్డలు లేకుండా కలుపుకోవాలి. తరువాత అందులో పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, మిరియాలపొడి, తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి.ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పాలకూర వేసి కలుపుకోవాలి. ఈ డిష్‌ని ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లగా సర్వ్‌ చేసుకోవాలి. అన్నంలోకి లేదా పరోటాతో తీసుకుంటే రుచి బాగుంటుంది. 


Updated Date - 2022-04-23T18:58:16+05:30 IST